బరువు తగ్గాలని ప్రోటీన్ ఫుడ్ అధికంగా తీసుకోకండి.. ప్రమాదంలో పడతారు!

by Kanadam.Hamsa lekha |   ( Updated:2024-11-10 15:58:54.0  )
బరువు తగ్గాలని ప్రోటీన్ ఫుడ్ అధికంగా తీసుకోకండి.. ప్రమాదంలో పడతారు!
X

దిశ, ఫీచర్స్: ఆరోగ్యంగా ఉండడానికి శరీరానికి ప్రొటీన్లు చాలా అవసరం. ఇది రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఎంజైములుగా పనిచేస్తూ శరీరంలోని రకరకాల రసాయనాల చర్యకు తోడ్పడుతుంది. ప్రొటీన్ ఆరోగ్యానికి మేలు చేస్తుందనే ఉద్ధేశంతో కొంతమంది హై ప్రొటీన్ తీసుకుంటారు. బరువు తగ్గేందుకు కూడా చాలా మంది ప్రోటీన్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటారు. అయితే, ఈ ప్రోటీన్ ఫుడ్‌ని అతిగా తీసుకోవడం మంచిది కాదని ఫిట్‌నెస్ నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే.. హై ప్రొటీన్ ఫుడ్ కార్బ్స్‌ను తగ్గించి, శరీరంలోని పోషకాలు, ఫైబర్‌ను గ్రహించుకోలేదని, జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతుందని తెలిపారు.

ఎంత ప్రొటీన్ అవసరం: రోజుకు ఎంత ప్రొటీన్ తీసుకోవాలి అనేది వయస్సు, కార్యాచరణ, లింగం, ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది. శారీరక శ్రమ ఎక్కువగా చేయని వారు రోజుకు ప్రతి కిలోగ్రాము శరీర బరువుకు 0.8 గ్రాముల ప్రొటీన్ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. రోజూ గంటకు పైగా వర్కౌట్స్ చేసేవారు కిలో శరీర బరువుకు 1.2 లేదా 1.7 గ్రాముల వరకు ప్రొటీన్ తీసుకోవచ్చని చెబుతున్నారు. ఇలా సరైన మోతాదులో ప్రొటీన్ తీసుకునే వారు వారానికి కేజీ బరువు తగ్గవచ్చు.

అయితే, ఈ ప్రొటీన్ ఫుడ్‌ని అతిగా తీసుకుంటే మాత్రం బరువు పెరిగే అవకాశంతో పాటుగా ఇతర సమస్యలు కూడా వచ్చే చాన్స్ ఉంది. అందుకే ప్రొటీన్లను శరీరానికి సరిపడా తీసుకోవడం మంచిది.

ప్రొటీన్ ఎక్కువగా ఉండే ఆహారం: ఈ ఆహార పదార్థాల్లో ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. అవేంటంటే..పప్పు ధాన్యాలు, పన్నీర్, చేపలు, గుడ్లు, పాల ఉత్పత్తులు, నట్స్, క్వినోవా వంటి వాటిలో పుష్కలంగా ఉంటుంది. వీటిని సరైన డైట్ ప్లాన్ ఆధారంగా తీసుకోవాలి.

బరువు తగ్గేందుకు ఎలా ఉపయోగపడుతుంది?:

మజిల్స్‌కు మేలు: బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తున్న వారికి మజిల్స్ తగ్గకుండా ఈ ప్రొటీన్ కాపాడుతుంది. దీనిని సరైన పరిమాణంలో తీసుకోవడం వల్ల కండరాల మాస్‌ను కాపాడి, దాని బదులు ఫ్యాట్ తగ్గేలా చేస్తుంది.

జీవక్రియకు మంచిది: కార్బోహైట్రేడ్లు, ఫ్యాట్ కంటే ప్రొటీన్ జీర్ణం కావాలంటే ఎక్కువ ఎనర్జీ అవసరం. దీనివల్ల జీవక్రియ రేటు పెరిగి, ఎక్కువ క్యాలరీలు బర్న్ అవుతాయి.

తృప్తి కలుగుతుంది: ప్రొటీన్లు ఉన్న ఆహారం తినడం వల్ల కడుపు నిండిన తృప్తి కలుగుతుంది. ఇది ఆహారం ఎక్కువ తినకుండా నియంత్రిస్తుంది. కార్బోహైడ్రేట్ల కంటే ప్రొటీన్లు జీర్ణం అయ్యేందుకు ఎక్కువ సమయం పడుతుంది. అందువల్ల త్వరగా ఆకలి వేయదు.

*గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.


Read More ...

పిల్లల బ్రెయిన్ షార్ప్‌గా పనిచేయాలంటే.. ఈ ఆహారాలు పెట్టండి..!


Advertisement

Next Story

Most Viewed