Celebrity Divorces.. కాపురాలు కూలుతున్నాయ్.!

by Daayi Srishailam |
Celebrity Divorces.. కాపురాలు కూలుతున్నాయ్.!
X

పెళ్లి..

జన్మ జన్మల బంధం.!

మూడుముళ్లు.. ఏడడుగుల సాక్షిగా..

మనసులు కలవడమే మంత్రం పరమార్థంగా ఒక్కటవుతారు.

తడబడితే పొరబడితే తప్పుదిద్దుకో..

ఒకరినొకరు తెలుసుకొని..

ఒడిదుడుకులు తట్టుకొని..

మసకేయని పున్నమిలా మనికి నింపుకో అని కలిసిపోతారు.

అంత బలమైన.. బాధ్యతగల బంధాలిప్పుడు..

పుటుక్కుమని తెగిపోతున్నాయి.

కారణాలేవైనా కావచ్చు..

డైవర్స్ ఇప్పుడొక ట్రెండ్ అయ్యింది.!

"మన" అని కాకుండా "నా" అని ఆలోచిస్తే మనస్పర్దలు వస్తుంటాయి. అవే పచ్చని కాపురాలను మేకమేడల్లా కూల్చేస్తున్నాయి. సెలబ్రిటీలే కాదు.. కామన్‌మ్యాన్‌లో కూడా ఈ ధోరణి ఎక్కువైంది. చిన్న లొల్లికి కూడా "డైవర్సిచ్చి పడేస్తా" అనే బెదిరింపులు ఎక్కువైపోతున్నాయి.!!

21 ఏళ్ల తర్వాత.?

క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తన భార్య ఆర్తి అహల్వాత్‌కు విడాకులిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సెహ్వాగ్ ఫ్యామిలీలోని ప్రతీ మూమెంట్‌ని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటాడు. కానీ ఇటీవలి పాలక్కడ్ విశ్వ నాగయక్షి ఆలయ సందర్శనలో భార్య కనిపించలేదు. ప్రతీ పెళ్లిరోజుకు ఫ్యామిలీ ఫొటో పెట్టి భార్యనూ ట్యాగ్ చేసే సెహ్వాగ్ ఈ యానివర్సిరీకి అసలు పోస్టే పెట్టలేదు. వీళ్ల పెళ్లి జరిగి 21 సంవత్సరాలు. ఇద్దరు కొడుకులూ పెద్దొళ్లయ్యారు. ఇన్నేళ్ల తర్వాత విడాకులేంటి.? అనే చర్చ కూడా జరుగుతుంది. మరీ ముఖ్యంగా వీళ్లు చిన్ననాటి స్నేహితులు. మరి ఇన్నేళ్ల బంధంలో వీళ్లు ఏం అర్థం చేసుకున్నట్లు.?

కలర్స్ స్వాతి కటీఫ్.?

సమంత డైవర్స్ తర్వాత టాలివుడ్లో కలర్స్ స్వాతి గురించే వినిపిస్తోంది. కేరళ పైలట్ వికాస్ వాసును 2018లో పెళ్లి చేసుకుంది స్వాతి. కొన్నాళ్లకే మనస్పర్దలంటూ ప్రచారమైంది. మంతాఫ్ మధు అనే సినిమా ప్రమోషన్స్ టైమ్లోనూ హజ్బెండ్ గురించి అడిగితే చిరాకు పడింది. వీరి మధ్య దూరం పెరిగిందనే వార్తలు బలపడ్డాయి. మళ్లీ స్వాతి విడాకుల వార్తలొస్తున్నాయి. సోషల్ మీడియా అకౌంట్ల నుంచి భర్త.. పెళ్లి ఫొటోలను స్వాతి డిలీట్ చేసి డైవర్స్‌పై హింట్ ఇచ్చిందంటున్నారు. అదేంటో.. మనస్పర్దలొస్తే కూర్చొని మాట్లాడుకోవాలి కానీ.. ఇలా ఫొటోలు తీసేసి హింట్ ఇవ్వడమేంటి.?

2024.. డైవర్స్ ఇయర్.!

సినీ.. క్రీడా సెలబ్రిటీల కాపురాలు పేకమేడల్లా కూలిపోతుండటంతో 2024 సంవత్సరాన్ని విడాకుల నామ సంవత్సరంగా పిలుస్తున్నారు నెటిజన్లు. 2024లో సుమారు 10 జంటలకు విడాకులయ్యాయి. శిఖర్ ధావన్.. దినేష్ కార్తిక్.. హార్దిక్ పాండ్యా.. ఇప్పుడు యజ్వేంద్ర చాహల్. యజ్వేంద్ర తన భార్య ధనశ్రీతో డైవర్స్ తీసుకున్నాడనే ప్రచారం జరుగుతోంది. మరో క్రికెటర్ మనీష్ పాండే కూడా విడాకుల బాట పట్టాడట. సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడంత నెట్టింట వీరి విడాకుల కథ చక్కర్లు కొడుతోంది. అప్పట్లో సానియామీర్జా, షోయబ్ మాలిక్ కథ ఇలాగే ముగిసింది.!

లేటు వయసు గ్రే డైవర్స్

కొందరు 30-40 ఏళ్లు కలిసి జీవించిన తర్వాత కూడా డైవర్స్‌కు సై అంటున్నారు. దీనిని గ్రే డైవర్స్ అంటారట. చాలాకాలం కలిసి జీవంచిన తర్వాత విడిపోవాలని అనుకోవడం చాలా కష్టం. కానీ కొందరు చిన్న చిన్న విషయాలకు గొడవలు పడి డైవర్స్ తీసుకుంటున్నారు. ఎగ్జాంపుల్ ఏఆర్ రెహమాన్. ఏమైందో ఏమో తెలియదు కానీ.. 57 సంవత్సరాల వయసులో భార్యకు విడాకులు ఇచ్చాడు. అమీర్ ఖాన్.. కిరణ్ రావుది 20 ఏళ్ల బంధం. అయినా మనస్పర్దల కారణంగా విడిపోయారు. పెళ్లీడుకొచ్చిన పిల్లలున్న తర్వాత కూడా ఇలా గ్రే డైవర్స్ పేరిట విడిపోవడం ఏంటని ఆశ్చర్యం కలిగిస్తోంది.

పిల్లలపై చెడు ప్రభావం.!

భార్యాభర్తలు విడిపోతే అది పిల్లలపై ఊహించని ప్రభావం చూపిస్తుంది. పిల్లలు పెద్దయ్యాక మంచి వాతావరణంలో వాళ్లను పెంచాలి. హీరో సల్మాన్ ఖాన్ సోదరుడు సోహైల్ తన భార్య సీమా సజ్దేతో విడాకులు తీసుకున్నాక సీమా స్పందించింది. "24 ఏళ్లు మా వైవాహిక బంధం సాగింది. మనం ఎప్పటికీ సంతోషంగా ఉండాలనుకుంటాం. కానీ అది అన్నిసార్లు సాధ్యపడదు. విడిపోవాలనిపిస్తుంది. అదే పిల్లలకు శాపంగా మారుతుంది" అని సీమా తన డైవర్స్ తర్వాత పిల్లల గురించి బాధతో చెప్పిన మాటలివి. అమీర్ ఖాన్ కూతురు కూడా పేరెంట్స్ డైవర్స్ తర్వాత మారిపోయారని బాధపడింది.

ఈ కారణాల వల్లే

విడాకుల గురించి ఐక్యరాజ్య సమితి ఒక నివేదిక విడుదల చేసింది. దాంట్లో ఇండియాలో పెరుగుతున్న డైవర్స్ గురించి ప్రస్తావించింది. ముఖ్యంగా గృహహింస.. మోసం అనే కారణాలతో విడాకులు కోరుతున్నట్లు పేర్కొన్నది. 50 ఏళ్ల వయసులో కూడా విడాకులు తీసుకుంటున్నారంటే వారు స్వేచ్ఛను కోరుకుంటున్నారని చెప్పింది. అందుకే పురుషుల కన్నా ఎక్కువ స్త్రీలే డైవర్స్ కోరుంటున్నారట. వైవాహిక జీవితంలో తమకేమీ దక్కడం లేదని భావించిన స్త్రీలు వెంటనే డైవర్స్ కోరుంటున్నారట. ఆర్థిక భద్రత.. పిల్లల పెంపకం గురించి పెద్దగా ఆందోళన చెందడం లేదని ఐక్యరాజ్య సమితి చెప్తోంది.

విడాకుల రేటు 6.7

బెంగళూరు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అతుల్ సుభాష్ ఆత్మహత్య తర్వాత వివాహ బంధంపై పెద్ద చర్చే జరిగింది. 2024 చివరలో ఐక్యరాజ్య సమితి విడుదల చేసిన నివేదిక ప్రకారం.. ఇండియాలో అత్యధిక విడాకులు నమోదైన రాష్ట్రంగా మహారాష్ట్ర నిలిచింది. ఇక్కడ 18.7శాతం విడాకుల రేటు ఉంది. తర్వాత 11.7శాతంతో కర్ణాటక.. 8.2శాతంతో వెస్ట్ బెంగాల్ రెండు.. మూడు స్థానాల్లో నిలిచాయి. ఢిల్లీ 7.7, తమిళనాడు 7.1, తెలంగాణ 6.7, కేరళ 6.3 శాతంగా ఉంది. ఇండియాలో విడాకుల రేటు 2005లో 0.6గా ఉండగా.. 2019లో 1.1 శాతానికి పెరిగింది. అదిప్పుడు మూడురెట్లు పెరిగిందట.

విడాకులపై సుప్రీంకోర్ట్..

తమిళనాడుకు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ జంటకు పెళ్లయి దాదాపు 20 ఏళ్లుగా విడిగా ఉంటున్నారు. విడాకుల కోసం భర్త మద్రాస్ కోర్టును ఆశ్రయిస్తే డైవర్స్ సాంక్షనైంది. దానిని సవాల్ చేస్తూ భార్య సుప్రీంకోర్టుకెళ్లింది. "కలిసుండాలని ఒక్కరికే ఉంటే సరిపోదు" అని సుప్రీం తీర్పునిచ్చింది.

మొదటి విడాకులు

1864లో జన్మించిన రుఖ్మాబాయికి 11 ఏళ్ల వయసులో దాదాజీ భికాజీతో పెళ్లి చేశారు. బలవంతంగా పెళ్లి చేశారని ఆమె కోర్టుకెక్కారు. బ్రిటీష్ క్వీన్ విక్టోరియా జోక్యంతో ఆమెకు 1885లో విడాకులొచ్చాయి. భారతదేశంలో మొదటి మహిళా డాక్టర్‌.. మొదటిసారిగా డైవర్స్ తీసుకున్న మహిళ ఆమెనే.

పక్షుల్లోనూ డైవర్స్

ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఏర్పడినప్పుడు పక్షులు కూడా విడాకులు తీసుకుంటాయని ఆస్ట్రేలియా పరిశోధకులు అంటున్నారు. సీషెల్స్ ద్వీపాల్లో కనిపించే వార్‌బ్లర్ పక్షులపై అధ్యయనం చేసి ఈ విషయాన్ని చెప్పారు. ఈ పక్షులు 15 ఏళ్లు మాత్రమే కలిసివుండి తర్వాత వేరు కాపురం పెడతాయట.

సోషల్ మీడియా వల్లే: పూరీ జగన్నాధ్

10 విడాకుల్లో 3 సోషల్ మీడియా కారణంగానే అవుతున్నాయి. మీ భాగస్వామే ప్రపంచం అనుకున్నప్పుడు మిగిలిన ప్రపంచంతో మీకెందుకు.? మీ కుటుంబం బాగుండాలనుకుంటే అవన్నీ పెట్టడమెందుకు.? ముఖ్యంగా అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉండండి. కాపురాలను కాపాడుకోండి.

మహారాష్ట్రలోని ముంబ్రాలో భార్య మార్నింగ్ వాక్‌కు వెళ్లిందని భర్త నొచ్చుకున్నాడు. వెంటనే భార్యకు.. మామకు ఫోన్ చేసి విడాకులిస్తు్న్నట్లు చెప్పాడు.

సింగర్ నోయల్ తెలుసు కదా. అతడికి హీరోయిన్ ఎస్తర్‌తో పెళ్లి జరిగింది. ఏమైందో ఏమోగానీ పెళ్లయిన 16 రోజులకే వీళ్లు విడాకులు తీసుకున్నారు.

హృతిక్ రోషన్ తన భార్య సుస్సానే పెళ్లయిన 14 ఏళ్లకు విడిపోయారు. భరణం కింద హృతిక్ రూ.380 కోట్లు ఇచ్చాడు. సినీ ఇండస్ట్రీలో ఇదే ఖరీదైన డైవర్స్.

Next Story

Most Viewed