Ladies Finger: బెండకాయలతో ఆ సమస్యలను తగ్గించుకోవచ్చని తెలుసా

by Prasanna |
Ladies Finger: బెండకాయలతో ఆ సమస్యలను తగ్గించుకోవచ్చని తెలుసా
X

దిశ, ఫీచర్స్ : మనలో చాలా మంది బెండకాయలను ఇష్టంగా తింటారు. దీనిని వారానికి రెండు సార్లు అయినా తినాలని వైద్యులు చెబుతున్నారు. ఎందుకంటే వీటిలో ఫైబర్, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. పొట్ట సమస్యలతో ఇబ్బంది పడేవారికి బెండకాయ చాలా మంచిది. అలాగే మధుమేహన్ని కూడా తగ్గిస్తుంది. ఈ కూరగాయను తినడం వల్ల మన శరీరానికి కలిగే లాభాలేంటో ఇక్కడ చూద్దాం..

గుండె ఆరోగ్యం

బెండకాయలో ఉండే పొటాషియం రక్తపోటును తగ్గిస్తుంది. ఇది మంచి కొలెస్ట్రాల్ పెంచి చెడు కొలెస్ట్రాల్ ను పూర్తిగా తగ్గిస్తుంది. ఈ కారణంగా హార్ట్ స్ట్రోక్, గుండె జబ్బులు రాకుండా చేస్తుంది.

రోగనిరోధక శక్తి

బెండకాయలో విటమిన్ A , విటమిన్ సి ఉంటాయి. ఇవి ఇమ్యూనిటీ పవర్ ని పెంచుతాయి. అంతే కాకుండా ఇవి జలుబు, ఫ్లూ, స్కిన్ సమస్యలు రాకుండా చేస్తాయి.

బ్లడ్ లో షుగర్ లెవెల్స్

బెండకాయలో ఉండే ఫైబర్ బ్లడ్ లో షుగర్ లెవెల్స్ నియంత్రిస్తుందని వైద్య నిపుణులు తెలిపారు. ముఖ్యంగా, బెండకాయ టైప్ 2 మధుమేహం ఉన్నవారికి చాలా మంచిది. ఇవే కాకుండా ఇతర అనారోగ్య సమస్యలు రాకుండా చేస్తుంది.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.



Next Story