- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Spinach Juice : ఈ ఆకు రసంతో ఆ ప్రాణాంతక సమస్యకి చెక్ పెట్టొచ్చని తెలుసా?
దిశ, ఫీచర్స్ : పాలకూర మన ఆరోగ్యానికి అన్ని రకాలుగా మంచిది. దీనిని వారంలో మూడు సార్లు అయినా తీసుకోవాలి. ఎందుకంటే మన శరీరానికి కావాల్సిన పోషకాలు ఉన్నాయి. దీనిలో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. మనం రోజువారీ తినే ఫుడ్ లో పాల కూరని అలవాటు చేసుకుంటే.. కొన్ని అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. బీటా-కెరోటిన్, జియక్సాంథిన్ మొదలైనవి ఇవి మన హెల్త్ కి చాలా మేలు చేస్తుంది. ఇంకా దీనిలో విటమిన్ A, విటమిన్ K, విటమిన్ C పుష్కలంగా ఉంటాయి. ఈ రసాన్ని తాగడం వల్ల మనకి కలిగే లాభాలేంటో ఇక్కడ చూద్దాం..
గుండె ఆరోగ్యం
పాలకూరలో ఫోలేట్ ఎక్కువగా ఉంటుంది. ఇది హోమోసిస్టైన్ లెవెల్స్ ను తగ్గిస్తుంది. అలాగే గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. కాబట్టి వారంలో రెండు సార్లు అయినా పాల కూరను తినండి.
రక్తహీనత
చాలా మంది రక్తహీనత సమస్యతో బాధ పడుతుంటారు. దీనిలో ఐరన్ అధికంగా ఉంటుంది. ఇది రక్తహీనతకు చెక్ పెడుతుంది. మహిళలలో ఎక్కువగా ఈ సమస్యలతో చాలా ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారు పాలకూర జ్యూస్ ని తాగితే మంచి ఫలితం ఉంటుంది.
రోగనిరోధక శక్తి
పాలకూరలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది నీరసంగా ఉండే వాళ్ళకి మంచిగా పనిచేస్తుంది. జలుబు, దగ్గు వంటి సమస్యలకు కూడా ఉపశమనం పొందేలా చేస్తుంది. అలాగే, సీజన్ సమస్యల నుంచి మనల్ని కాపాడుతుంది.
క్యాన్సర్
పాలకూరలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాలను పెరగకుండా చేస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. పాల కూర జ్యూస్ తీసుకుంటే క్యాన్సర్‌లు రాకుండా ఉంటుంది.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.