- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చనిపోయిన రెండేళ్ల తర్వాత బతికిన 'డెడ్' బుక్ రైటర్
దిశ, ఫీచర్స్: 'ఏ టేనస్సీ రొమాన్స్' బుక్ రైటర్ సుసాన్ మీచెన్ చనిపోయిందని సెప్టెంబర్ 2020లో సొంత కూతురు ప్రకటించింది. ఆన్‌లైన్ బెదిరింపుల కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లు తెలపడంతో.. ఆమె ఫ్రెండ్స్, కొలీగ్స్, ఫ్యాన్స్ షాక్ అయ్యారు. దీంతో ఆమె రాసిన 'డెడ్' బుక్‌ను కొనుగోలు చేసిన అభిమానులు.. ఆ విధంగా దు:ఖంలో ఉన్న కుటుంబానికి మద్దతు ఇవ్వాలనుకున్నారు. అప్పటి నుంచి తన ఫేస్‌బుక్‌ను.. ఆమె రాసిన పుస్తకాలను ప్రచారం చేసేందుకు ఫ్యామిలీ యూజ్ చేస్తున్నట్లు అనుకున్నారు. కానీ అనుకోని విధంగా రెండేళ్ల తర్వాత ఆమె బతికొచ్చింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఫేస్‌బుక్‌లోని రైటర్స్ కమ్యూనిటీలో ప్రకటించింది.
'నేను దీన్ని ఎలా చేయాలో మిలియన్ సార్లు చర్చించాను. ఇది సరైనదా కాదా అని ఇంకా ఖచ్చితంగా తెలియలేదు. టన్నుల ప్రశ్నలతో చాలా మంది వ్యక్తులు గ్రూప్ నుంచి నిష్క్రమించబోతున్నారని నేను ఊహించగలను. కానీ నా కుటుంబం నాకు ఇదే మంచిదని భావించింది. అందుకని నేను వారిని తప్పు పట్టలేను. నేను దాదాపు నా చేతిలో మరోసారి చనిపోయాను. వారు మళ్లీ ఆ నరకం గుండా వెళ్ళవలసి వచ్చింది. మళ్లీ తిరిగి రావడంలో అర్థం లేదు కానీ నేను ఇప్పుడు మంచి స్థానంలో ఉన్నాను. రాయాలని ఆశిస్తున్నాను. వినోదాన్ని ప్రారంభించనివ్వండి' అని బతికే ఉన్నట్లు సింపుల్‌గా చెప్పేసింది.
నిజానికి సుసాన్ మోస్ట్ పాపులర్ రైటర్ ఏమీ కాదు కానీ ఆన్‌లైన్ వేధింపులతో సూసైడ్ చేసుకున్నందున.. ఇంటర్నేషన్ మీడియా (సీఎన్ఎన్, బీబీసీ, యూఎస్ఏ టుడే) ఆమె కథనాన్ని ప్రచురించింది. హైలెట్ చేసింది. అయితే బుక్స్ సేల్స్ పెంచుకునేందుకే ఈ నాటకం ఆడిందని అంటున్నారు నెటిజన్స్. తన కూతురు కాదు తనకు తానే మరణాన్ని అనౌన్స్ చేసుకుని.. ఇన్నాళ్లు డ్రామా చేసిందని ఫైర్ అవుతున్నారు. ఓన్ డెత్‌ను ప్రమోట్ చేసుకోవడం వలన చట్టపరమైన శిక్ష ఉండదేమో కానీ ఈ విషయంలో ఇతరులను ఫూల్స్ చేయడం నైతికత కాదని మండిపడుతున్నారు.