డేంజర్: చికెన్, పెరుగును మిక్స్ చేస్తున్నారా? అయితే మీ సంగతి అంతే అంటున్న నిపుణులు

by Kavitha |   ( Updated:2024-08-31 07:35:16.0  )
డేంజర్: చికెన్, పెరుగును మిక్స్ చేస్తున్నారా? అయితే మీ సంగతి అంతే అంటున్న నిపుణులు
X

దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా చాలామంది చికెన్ కర్రీ టేస్టీగా, థిక్ గ్రేవీ రావడం కోసం పెరుగును మిక్స్ చేస్తుంటారు. ఇక బిర్యానీలో అయితే పక్కా కర్డ్ ఉండాల్సిందే. అలాగే మరికొంత మంది చికెన్‌తో భోజనం చేశాక లాస్ట్‌లో పెరుగుతో ముగించేస్తారు. అయితే తినడం వల్ల ఆరోగ్యానికి ప్రమాదం అంటున్నారు నిపుణులు. మరి ఈ ప్రమాదాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

బేసిక్‌గా చికెన్ పేరు వినగానే మాంసాహార ప్రియులకు నాలుక లపలపలాడుతుంటుంది. చికెన్ కర్రీ, చికెన్‌ ఫ్రై, తందూరీ చికెన్‌ ఇలా రకరకాల వంటలు నోరు ఊరిస్తుంటాయి. ఇలాంటి చికెన్‌ ప్రియులకు ఆరోగ్య నిపుణులు ఓ సూచన చేస్తున్నారు. అదేంటంటే.. చాలామంది చికెన్‌తో తిన్న తర్వాత చివర్లో పెరుగు తింటారు. ఇలా తినడం అసలు మంచిది కాదు అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా చికెన్‌ని పెరుగుతో కలిపి తింటే జీర్ణ సమస్యలు వస్తాయట. అందుకే ఈ రెండింటి కాంబినేషన్‌కు దూరంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

అలాగే చాలా మంది పెరుగు వేసి చికెన్‌ వండుతుంటారు. ఇలాంటి అలవాటు ఉంటే కచ్చితంగా మానుకోవాలి అంటున్నారు నిపుణులు. పెరుగు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కానీ, చికెన్‌తో పాటు పెరుగును కలపడం వల్ల మాత్రం నష్టమే ఎక్కువ ఉందని నిపుణులు అంటున్నారు. చికెన్‌ వల్ల శరీరంపై వేడి ప్రభావం ఉంటే.. పెరుగు వల్ల చల్లని ప్రభావం ఉంటుంది. ఈ రెండింటి ఎఫెక్ట్.. జీర్ణ వ్యవస్థపై పడతాయి. ఈ ప్రభావం చెడుగా ఉంటుంది కాబట్టి వీటిని మిక్స్ అసలు చేయొద్దు.

మరికొందరికి చికెన్‌ తిన్న తర్వాత పాలు తాగే అలవాటు కూడా ఉంటుంది. అలవాటు లేకున్నా చికెన్ తిన్న తర్వాత పాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా తాగవద్దని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.

ఇక కొందరికి రాత్రి భోజనం తర్వాత పాలు తాగి పడుకోవడం అలవాటు ఉండటం కామన్. అయితే చికెన్‌ తిన్న రోజు పాలకు దూరంగా ఉండాలి. ఇలా చేయడం వల్ల శరీరంపై దద్దుర్లు, తెల్ల మచ్చలు, దురద వంటి సమస్యలు వస్తాయి కాబట్టి చికెన్ తిన్న తర్వాత పాలను కూడా స్కిప్ చేసేయడం బెటర్.

నోట్: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహన కోసం మాత్రమే దీనిని అందిస్తున్నాం. నిర్ధారణలు, పర్యవసనాలకు సంబంధించి ‘దిశ’ ఎటువంటి బాధ్యత వహించదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించడం ఉత్తమం.

Advertisement

Next Story

Most Viewed