Daisuki : పన్నెండేండ్లుగా డైలీ అరగంట మాత్రమే నిద్రపోతున్న వ్యక్తి.. ఎలా సాధ్యం?

by Javid Pasha |
Daisuki : పన్నెండేండ్లుగా డైలీ అరగంట మాత్రమే నిద్రపోతున్న వ్యక్తి.. ఎలా సాధ్యం?
X

దిశ, ఫీచర్స్: కంటి నిండా నిద్రపోవడం మానసిక, శారీరక ఆరోగ్యానికి మంచిదన్న విషయం తెలిసిందే. డైలీ కనీసం 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలని కూడా ఆరోగ్య నిపుణులు సూచిస్తుంటారు. దీనివల్ల వృద్ధాప్య ఛాయలు కూడా దరిచేరవని, యవ్వనంగా కనిపిస్తారని కూడా చెప్తుంటారు. కానీ ఓ వ్యక్తి మాత్రం ఇందుకు భిన్నంగా చేస్తున్నాడు. త్వరగా ముసలి తనం రాకుండా ఉండేందుకు పన్నేండేండ్లుగా సరిగ్గా నిద్రపోవడం లేదట. ఇంతకీ ఎవరతను? నిద్రకు యవ్వనానికి సంబంధం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

పేరు డైసుకీ హోరీ. జపాన్‌కు చెందిన ఈ వ్యక్తి రోజులో జస్ట్ 30 నిమిషాలు మాత్రమే నిద్రపోతాడట. మిగతా టైమ్ అంతా ఫిట్‌నెస్ పెంచుకునేందుకు జిమ్‌లో కసరత్తులు చేస్తుంటాడు. అంటే వీక్లీ 16 గంటలసేపు వ్యాయామం చేస్తూనే ఉంటాడు. ఇది వింటే ఎవరికైనా అనుమానం రాకమానదు? కేవలం అరగంట నిద్రపోయే వ్యక్తి ఆరోగ్యంగా ఎలా ఉంటాడు? అనుకుంటాం. కానీ హోరీ మాత్రం ఆరోగ్యం, అందం, యవ్వనం కోసమే ఇదంతా చేస్తాను అంటున్నాడు.

ఏ ఒకటో, రెండో రోజులు కూడా కాదు. ఏకంగా 12 ఏండ్లుగా రోజులో 30 నిమిషాలు మాత్రమే నిద్రపోతున్నా డైసుకీ హోరీకి ఇదెలా సాధ్యమైంది? అంటే.. తనకు అలా అలవాటైందని, మైండ్ సెట్ మార్చుకున్నానని చెప్తున్నాడు. ఎన్నిగంటలు కునుకు తీశామనేది కాదు, ఎంత బాగా నాణ్యమైన నిద్రపోయామనేదే ఇంపార్టెంట్ అంటున్నాడు. ఏది ఏమైనా డైసుకీ హోరీ లైఫ్ స్టైల్ చాలా ఇంట్రెస్ట్‌గా ఉందని పలువురు పేర్కొంటున్నారు. అసలు రోజూ అరగంట నిద్రపోతూ ఎలా జీవించడం అసాధ్యమో.. అతని విషయంలో పరిశోధకులు తగిన సమాచారం సేకరించాలని పలువురు నెటిజన్లు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed