WhatsApp - Meta AI: వాట్సాప్‌‌‌‌‌‌లో Meta AI వినియోగించి GIF ఇలా క్రియేట్ చేసుకోండి..

by Sujitha Rachapalli |
WhatsApp - Meta AI: వాట్సాప్‌‌‌‌‌‌లో Meta AI వినియోగించి GIF  ఇలా క్రియేట్ చేసుకోండి..
X

దిశ, ఫీచర్స్: వాట్సాప్ లో Meta AI సంచలనం సృష్టిస్తుంది. గత నెలలో AI అసిస్టెంట్ సమాచారం అందించడం, ఇచ్చిన టాస్క్ పూర్తి చేయడం, జోక్స్ పేల్చడం ద్వారా జనాల్లో మంచి ఆదరణ పొందిన ఈ స్పెషల్ ఫీచర్.. ఇప్పుడు సరికొత్త ఆవిష్కరణతో వచ్చేసింది. చాలా మంది చాట్ చేస్తున్నప్పుడు సరైన GIF కోసం సెర్చ్ చేస్తుంటారు. ఇకపై ఈ అవసరం లేకుండా సొంతంగా క్రియేట్ చేసుకునే వెసులుబాటు తీసుకొచ్చింది. కాగా మీ క్రియేటివిటీ ఉపయోగించి Meta AIతో GIF ఎలా సృష్టించాలో తెలుసుకుందాం.

  • ముందుగా Play Store కు వెళ్లి వాట్సాప్ లేటెస్ట్ వర్షన్ అప్డేట్ అయిందా లేదా తెలుసుకోండి. లేదంటే అప్ డేట్ చేయండి.
  • ఇప్పుడు వాట్సాప్ యాప్ ఓపెన్ చేయండి.
  • మీరు ఎవరికైతే GIF పంపించాలని అనుకుంటున్నారో ఆ చాట్ కు వెళ్లండి.
  • ఇప్పుడు + సైన్ ప్రెస్ చేయండి.
  • ఇమాజిన్ చూజ్ చేసుకోండి.
  • వాట్సాప్ Meta AI ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు కావాల్సిన GIF వివరణ టైప్ చేయండి.
  • డీటెయిల్స్ ఇచ్చాక ఎంటర్ నొక్కేయండి.
  • యానిమేట్ ప్రెస్ చేయడం ద్వారా GIF గా మార్చే అవకాశం వస్తుంది.
  • ప్రాసెస్ పూర్తయ్యాక ఈ యానిమేటెడ్ GIF సెండ్ చేసేందుకు ఎంటర్ నొక్కండి.
Advertisement

Next Story