హోలీ స్పెషల్.. ఏ రాశి వారికి ఏ రంగు అదృష్టం తెస్తుందో తెలుసుకోండి!

by samatah |
హోలీ స్పెషల్.. ఏ రాశి వారికి ఏ రంగు అదృష్టం తెస్తుందో తెలుసుకోండి!
X

దిశ, వెబ్‌డెస్క్ : పెద్ద వారు చిన్న పిల్లలుగా మారి ఎంతో ఆనందంగా ఆడుకునే పండుగలలో హోలీ ఒకటి. చాలా మంది ఈ పండుగ కోసం ఎదురు చూస్తుంటారు. ఎప్పుడెప్పుడు పండుగ వస్తుందో, తమ స్నేహితుల మీద ఎప్పుుడు రంగులు చల్లాల అని అనుకుంటారు. కాగా, హోలీ పండుగ వచ్చే స్తుంది. తీరొక్క రంగులు తీసుకొచ్చి చల్లుకుంటారు. అయితే ఈ రంగుల మీద కూడా జ్యోతిష్యశాస్త్రం ప్రభావం ఉంటుందంటున్నారు పండితులు. జ్యోతిష్యశాస్త్రం ద్వారా ఒక్కో రాశికి ఒక్కో రంగు కలిసి వస్తుంది. అందువలన ఆ రాశి వారికి కలిసి వచ్చే రంగులు చల్లుకోవడం ద్వారా అదృష్టం కలిసివస్తుందంట. అయితే ఈ హోలీకి ఏ రాశి వారికి ఏ రంగు కలిసి వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

మేష రాశి : ఈ రాశి వారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఏరుపు రంగు లేదా గులాబి రంగుతో హోలీ జరుపుకోవడం అదృష్టాన్ని తీసుకొస్తుందంట.

వృషభ రాశి : వృషభ రాశి వారికి సిల్వర్ కలర్ కలిసి వస్తుంది. సిల్వర్ కలర్‌తో వీరు హోలీ సెలబ్రేట్ చేసుకోవడం మంచిది.

మిథున రాశి : మిథున రాశి వారికి బుధుడు అధిపతి.అందువలన బుధ గ్రహం యొక్క రంగును ఆకుపచ్చగా పరిగణిస్తారు. కాబట్టి హోలీ రోజున ఆకుపచ్చ రంగుతో లేదా పసుపు, గులాబీ, నారింజ రంగుతో హోలీ జరుపుకోవడం మంచిది.

కర్కాటక రాశి : కర్కాటక రాశి వారు ఎరుపు రంగుతో హోలీ ఆడటం మంచిది.

సింహ రాశి : సింహ రాశికి అధిపతి చంద్రుడు. ఈ రాశి వారు తెలుపు రంగుతో హోలీ ఆడాలి. కానీ హోలీలో మనకు తెలుపు రంగు కనపడదు కాబట్టి నారింజ, ఎరుపు, పసుపు రంగులతో హోలీ ఆడొచ్చు.

కన్యా రాశి : ఈ రాశి వారు లేత ఆకుపచ్చ, లేదా పసుపు రంగుతో హోలీ ఆడటం ద్వారా అదృష్టం కలిసి వస్తుంది.

తుల రాశి : తుల రాశి వారు సిల్వర్ లేదా, గులాబీ రంగుతో హోలీ ఆడటం శుభ సూచకం.

వృశ్చిక రాశి : వృశ్చిక రాశి వారు పసుపు రంగుతో హోలీ ఆడటం వారికి కలిసి వస్తుంది.

ధనస్సు రాశి : ధనస్సు రాశి వారు హోలీ పండుగ రోజు పసుపు లేదా గులాబీ రంగుతో హోలీ ఆడటం మంచిది.

మకర రాశి : ఈ రాశి వారికి నీలం రంగు శుభప్రదం

కుంభ రాశి : శని ఈ రాశికి అధిపతి. శనిగ్రహం రంగు నలుపు లేదా నీలంగా పరిగణిస్తారు. కాబట్టి నీలం శుభప్రదం. మీరు నలుపు రంగుతో హోలీ ఆడలేరు కాబట్టి నీలం, ఆకుపచ్చ రంగుతో హోలీ ఆడొచ్చు.

మీన రాశి : మీన రాశి వారు పసుపు రంగుతో హోలీ ఆడటం ద్వారా వారి అదృష్టం కలిసి వస్తుంది.

Advertisement

Next Story

Most Viewed