Cobra: త్రాచు పాము నిజంగానే పగ పడుతుందా?

by Prasanna |   ( Updated:2023-03-10 09:49:01.0  )
Cobra: త్రాచు పాము నిజంగానే  పగ పడుతుందా?
X

దిశ, వెబ్ డెస్క్ : కోరిస పాడులో జరిగిన సంఘటన గురించి ఇక్కడ తెలుసుకుందాం. ఒక రోజు కోరిస పాడు హై స్కూల్లో పిల్లలు అందరూ సాయంత్రం ఆడుకుంటున్నారు. దూరంగా ఉన్న పుట్ట నుంచి త్రాచు పాము ఒకటి తల బయటకు పెట్టింది. అది చూసిన పిల్ల వాడొకడు. ఆకతాయి తనంతో దానిపైకి రాయి విసిరాడు. అది ఆ పాముకు తగిలి తగిలి .. వెంటనే పుట్టలోకి జారుకుంది. పిల్లలు కాసేపు నవ్వుకొని మరలా ఆటల్లో మునిగిపోయారు. చీకటి పడే వేళకి ఆటలు ముగించుకొని ఇంటి దోవ పట్టారు. రాయి విసిరన పిల్ల వాడు కూడా ఇంటికొచ్చి తన పుస్తకాలు గూట్లో పుస్తకాల సంచిని పెట్టబోయాడు. అంతే ఇందాకటి త్రాచు పాము ఆ గూట్లో దాక్కొని ఉంది. ఆ పిల్ల వాడి చేతిని కాటు వేసి పారి పోయింది.

పాముకు పగ పట్టకపోతే ఇది ఎలా సాధ్యం మయ్యిందని మనకి సందేహం రావచ్చు. ఆ రోజు అసలేం జరిగిందంటే.. నిజానికి అక్కడ పాము పగ పట్టలేదట. చుట్టు పక్కల తిరిగే త్రాచు పాము ఎటు వెళ్లాలో తెలియక ఆ రోజు పిల్ల వాడు పుస్తకాలు పెట్టుకునే గూట్లో పడక వేసింది. సరిగ్గా అప్పుడే ఇంటికి వచ్చిన పిల్ల వాడు గూట్లో పుస్తకాల పెట్టేటప్పుడు ఒత్తిడి తగిలి పాముకు కోపం వచ్చి కాటు వేసింది.

Advertisement

Next Story

Most Viewed