- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కొన్ని ప్రాంతాల్లోని ప్రజలు పాము కాటుకు ఎక్కువగా గురవుతుంటారు.. కారణం ఏంటో తెలుసా?
దిశ, ఫీచర్స్ : క్లైమేట్ చేంజ్ ఎఫెక్ట్ పర్యావరణంపై కాదు, మానవ జీవితాన్ని ప్రమాదంలో పడేసే అనేక ఇతర అంశాలతో ముడిపడి ఉంటుందని యూఎస్‌లోని జార్జియాకు చెందిన పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది. తీవ్రమైన ఉష్ణోగ్రతలు, వేడెక్కుతున్న భౌగోళిక పరిస్థితులు విషపూరిత పాముల్లో కాటువేయగలిగే స్వభావాన్ని మరింత పెంచుతాయని వారు పేర్కొన్నారు. అధ్యయనంలో భాగంగా 2014 నుంచి 2020 వరకు విషపూరిత పాము కాటుకు గురైన 3,908 మందికి సంబంధించిన మెడికల్ రిపోర్టులు, నివాసిత ప్రాంతాల డేటాను పరిశోధకులు విశ్లేషించారు. ఉష్ణోగ్రత, అవపాతం వంటి క్లైమేట్ చేంజ్ అంశాలతో పోల్చి చూడగా వేసవిలో, అలాగే మిగతా సీజన్లలో ఉక్కబోతతో కూడిన వాతావరణ పరిస్థితులు సంభవించినప్పుడే అత్యధిక మంది పాటు కాటుకు గురవుతున్నట్లు కనుగొన్నారు.
ప్రజెంట్ యూఎస్ జార్జియా పరిసర ప్రాంతాలు 17 రకాల విష సర్పాలకు నిలయంగా ఉన్నాయి. ఇక్కడ ఏడు రకాల పాముల వల్ల ప్రజలు తరచూ ఆందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే ఇవి వేడి వాతావరణంలో తమ ప్రవర్తనను మార్చుకుంటూ ఎక్కువగా మానవులను కాటు వేస్తున్నాయట. ఉష్ణోగ్రతలో ప్రతీ డిగ్రి సెల్సియస్ పెరుగుదల సగటు పాములలో దాదాపు 6 శాతం ఎక్కువగా మానవులను కాటువేయగల స్వభావాన్ని ప్రేరేపిస్తోందని జీవశాస్త్రవేత్తలు అంటున్నారు. అయితే ఈ పరిస్థితి కేవలం జార్జియాకే పరిమితమైందని అనుకోవడానికి లేదు. పరిశోధన మాత్రమే ఇక్కడ కొనసాగింది. యూరప్ సహా ప్రపంచంలో అత్యధిక ఉష్ణోగ్రతలు కలిగిన అటవీ సమీప ప్రాంతాలు, కొండలు, లోయల్లోని గ్రామాల పరిసర ప్రాంతాల్లోని విష సర్పాల ప్రమాదాన్ని ఎదుర్కొనే అవకాశం ఉంటుందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. అందుకే తరచుగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు పాముకాటు బారిన పడుతుంటారని చెప్తున్నారు.
Read More: ఉడికించిన పెసలు తినడం మన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు ఇవే