సెక్స్ తర్వాత సిగరేట్ తాగుతున్నారా? ఎంతటి ప్రమాదమో తెలుసుకోవాల్సిందే..

by Sujitha Rachapalli |
సెక్స్ తర్వాత సిగరేట్ తాగుతున్నారా? ఎంతటి ప్రమాదమో తెలుసుకోవాల్సిందే..
X

దిశ, ఫీచర్స్: థియేటర్‌లో సినిమా స్టార్ట్ అయ్యే ముందు ధూమపానం ఆరోగ్యానికి హానికరమని యాడ్ వేస్తనే ఉంటారు. కానీ ఆ హ్యాబిట్‌ను మార్చుకునే వాళ్లు ఎంత మందో దేవుడికే తెలియాలి. స్మోకింగ్ కారణంగా శ్వాసకోశ వ్యాధులు, గుండె సంబంధిత అనారోగ్యం, క్యాన్సర్‌ వస్తుందని హెచ్చరించినా వినేవారు తక్కువే. కాగా వీటితోపాటు సిగరెట్ స్మోక్‌ సెక్స్ లైఫ్‌ను ఎఫెక్ట్ చేస్తుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. స్త్రీ, పురుషులు ఇద్దరిపై కూడా ప్రభావం చూపుతుందని వార్నింగ్ ఇస్తున్నారు. పొగాకు వినియోగం, శృంగార జీవితాన్ని నాశనం చేస్తుందనే విషయం అండర్ ఎస్టిమేట్ చేయబడుతుందని.. దీనిపై మరిన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉందని అంటున్నారు. సెక్స్‌ తర్వాత సిగరెట్ ఎంజాయ్ చేసే అలవాటు ఉన్నవారిపై మరింత నెగెటివ్ ఎఫెక్ట్ పడుతుందంటున్న ఎక్స్‌‌పర్ట్స్.. టొబాకో వినియోగం వల్ల ఏం జరుగుతుందో వివరిస్తున్నారు.

పొగాకులో ఉండే మత్తు పదార్థం నికోటిన్ రక్తనాళాలు సంకోచించేలా చేస్తుంది. జననేంద్రియాలతో సహా శరీరం అంతటా రక్తప్రవాహం తగ్గేందుకు కారణం అవుతుంది. ఇలా జరగడం వల్ల పురుషుల్లో అంగస్తంభన సమస్యలు తలెత్తితే.. స్త్రీలలో వెజీనా డ్రై అయిపోతుంది. ల్యూబ్రకేషన్, సెక్సువల్ అరౌజల్ తగ్గిపోయి..సెక్స్ డ్రైవ్ కూడా తగ్గిపోతుంది. తద్వారా సంతానోత్పత్తి సమస్యలు రావడంతో.. ఫెర్టిలిటీ రేట్స్‌‌ డిక్రీజ్ అయిపోతాయి. కన్సీవ్ అయ్యే చాన్స్ చాలా తక్కువగా ఉంటుంది. ఇక స్మోక్ చేసే వారిలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటంతో.. లైంగిక సంక్రమణ వ్యాధులు సులభంగా సోకే ప్రమాదం ఉంటుంది.

Advertisement

Next Story

Most Viewed