బ్లడ్ క్యాన్సర్‌కు సిగరెట్-మద్యం కారణమా? ఎంతవరకు నిజం? హెల్త్ ఎక్స్‌ఫర్ట్స్ ఏం చెబుతున్నారంటే?

by Anjali |
బ్లడ్ క్యాన్సర్‌కు సిగరెట్-మద్యం కారణమా? ఎంతవరకు నిజం? హెల్త్ ఎక్స్‌ఫర్ట్స్ ఏం చెబుతున్నారంటే?
X

దిశ, ఫీచర్స్: ఇటీవల కాలంలో యువత మద్యం, సిగరెట్‌కు ఎంతగా బానిసవుతున్నారో మనం ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఒక్కపూట తాగకపోతే పిచ్చోళ్లలా బిహేవ్ చేసే స్టేజీకెళ్లిన వ్యక్తులను కూడా చూసే ఉంటారు. టీవీల్లో, థియేటర్లలో సినిమా పడే ముందు మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరమని యాడ్స్ వస్తూనే ఉంటాయి. కానీ చాలా మంది ఈ విషయాన్ని పెడచెవిన పెడతారు. ప్రాణం మీదకు వచ్చేవరకు కానీ సిగరెట్, మద్యం ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసుకోరు.

ఇకపోతే బ్లడ్ క్యాన్సర్‌కు మద్యం, సిగరెటే ముఖ్య కారణమంటున్నారు వైద్య నిపుణులు.మద్యపానం-ధూమపానం రక్త క్యాన్సర్‌ను అభివృద్ధి చేయడంతో ముఖ్యపాత్ర పోషిస్తుందని చెబుతున్నారు. సిగరెట్లలో ఎన్నో రకాల రసాయనాలు ఉండటంతో.. అవి కడుపులోని పేగుల ఆరోగ్యాన్ని పూర్తిగా నాశనం చేస్తాయని అంటున్నారు. అంతేకాకుండా రోగనిరోధక శక్తి ని బలహీనపరుస్తుందని, బ్లడ్ క్యాన్సర్ ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి అంతరాయం కలిగిస్తుందని వెల్లడించారు.

మద్యం తాగిన వారు స్మోక్ చేయడం వల్ల క్యాన్సర్‌కు దారితీస్తుందని నిపుణులు తెలిపారు. మద్యానికి-సిగరెట్‌కు పరస్పర సంబంధం కలిగి ఉందని పేర్కొన్నారు. మద్యంపై ఆధారపడిన వ్యక్తులు స్మోక్ చేసే చాన్స్ మూడు రెట్లు ఎక్కువ.. డ్రింక్ చేసేవారిలో 95 శాతం మంది పొగ తాగేవారని గుర్తించారు. స్మోక్ చేసే వ్యక్తులు మద్యంపై ఆధారపడే సాధారణ జనాభా కంటే నాలుగు రెట్లు ఎక్కువని నిపుణులు చెబుతున్నారు.

బ్లడ్ క్యాన్సర్ లక్షణాలు చూసినట్లైతే:

* బరువు తగ్గడం, అలసట

* తరచుగా జ్వరం చలి

* ఎముకలు

* కీళ్ల నొప్పులు

* చెమట రక్తస్రావం

* తలనొప్పి

* ఉదర అసౌకర్యం చర్మ మార్పులు

* శ్వాస ఆడకపోవడం

* తరచుగా ఇన్ఫెక్షన్లు

మద్యం-సిగరెట్ సేవించడం వల్ల వచ్చే సమస్యలు:

* రొమ్ము క్యాన్సర్

* మూత్రాశయ క్యాన్సర్

* కొలొరెక్టల్ క్యాన్సర్

* గర్భాశయ క్యాన్సర్

* అన్నవాహిక క్యాన్సర్

* కిడ్నీ క్యాన్సర్

* తల మరియు మెడ క్యాన్సర్

* ప్యాంక్రియాటిక్ క్యాన్సర్

* కాలేయ క్యాన్సర్

బ్లడ్ క్యాన్సర్ నివారణ:

బ్లడ్ క్యాన్సర్ నివారించాలంటే సరైన ఫుడ్ తీసుకోవాలి. రక్త క్యాన్సర్‌తో పోరాట చేస్తున్నప్పుడు నాణ్యమైన ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం. కొబ్బరి నీళ్లతో కూడిన ఆల్కలీన్ ఆహారం తీసుకోవాలి. పండ్లు, ఆకుకూరలు అండ్ గింజలు, తాజా పోషకమైన ఆహారాన్ని క్రమం తప్పకుండా తీసుకోవాలి. అంతేకాకుండా బ్లడ్ క్యాన్సర్ కు సంబంధించిన పరీక్షలు కూడా వైద్యుల వద్దకెళ్లి చేయించుకోవాలి.ఛాతీ X- రే, PET స్కాన్ అండ్ ఛాతీ, CT స్కాన్‌తో పాటు డయాగ్నస్టిక్ స్కాన్‌లు తీయించుకోవాలి. మంచి ఫుడ్ తీసుకుంటూ డాక్టర్ చెప్పిన సూచనలు ఫాలో అవ్వాలి.

* గమనిక: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. దీన్ని దిశ ధృవీకరించలేదు.

Advertisement

Next Story

Most Viewed