అంగారక గ్రహంపై నీటి జాడలు.. ఇటీవల కనుగొన్న చైనీస్ రోవర్

by sudharani |   ( Updated:2023-04-29 15:30:52.0  )
అంగారక గ్రహంపై నీటి జాడలు.. ఇటీవల కనుగొన్న చైనీస్ రోవర్
X

దిశ, ఫీచర్స్: విశ్వంలో కొన్ని గ్రహాల ఉనికి మనకు తెలిసినప్పటికీ ఇంకా తెలియని విషయాలు చాలా ఉన్నాయి. అందుకోసమే సైంటిస్టులు నిరంతర పరిశోధనలు కొనసాగిస్తూ ఉంటారు. తాజాగా చైనా జురాంగ్ రోవర్ అంగారక గ్రహంపై మొదటిసారిగా శుక్రవారం నీటి జాడల కార్యకలాపాలను కనుగొంది. అక్కడ జీవించడానికి అవసరమైన అనుకూల వాతావరణ ఉనికిని మరింతగా తెలుసుకునేందుకు ఇది దోహద పడుతుందని తెలిపారు. అంతేకాదు అంగారక గ్రహం పరిణామ చరిత్రను అర్థం చేసుకోవడానికి ఈ సమాచారం సహాయపడుతుందని, భౌగోళిక జీవితానికి భవిష్యత్తులో సాధ్యమయ్యే పలు ఆధారాలను అందిస్తుందని చెప్పారు.

2021లో రెడ్ ప్లానెట్‌పై దిగిన రోవర్.. అక్షాంశాల వద్ద ఇసుక దిబ్బలపై అంటే భూమధ్యరేఖ వైపు, దాని ధ్రువాలకు దూరంగా చాలా తక్కువగా వాటర్ లిక్విడ్‌కు సంబంధించిన సాక్ష్యాలను క్యాప్చర్ చేసింది. అయితే శాస్త్రవేత్తలు చాలా కాలంగా అంగారక గ్రహం భూమి లాంటి వాతావరణాన్ని కలిగి ఉందని, మూడు బిలియన్ సంవత్సరాల క్రితం దాని ఉపరితలం మీదుగా ప్రవహించే సముద్రం ఉండేదని నమ్ముతూ వస్తున్నారు. కానీ అక్కడ ఊహించిన దానికి భిన్నంగా ఉంది. కొద్దిపాటి వాటర్ లిక్విడ్ జాడలు మాత్రమే ఉన్నట్లు సైంటిస్టులు గ్రహించారు.

అయితే గతంలో భావించిననట్లు ప్రవహించే నీరు ఎక్కడికెళ్లింది? గ్రహం బయటి పొరలో లేదా క్రస్ట్‌లో ఏమైనా నిక్షిప్తమై ఉన్నదా? అనే సందేహాలను కూడా వ్యక్తం చేస్తున్నారు. అయితే రోవర్ నేరుగా మంచు లేదా మంచు రూపంలో నీటిని గుర్తించలేదని, బదులుగా పగుళ్లు, క్రస్ట్‌లతో ఉప్పు అధికంగా ఉండే దిబ్బలను గమనించిందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఉదయం 5 గంటల నుంచి 6 గంటల మధ్య అంగారకుడిపై ఉష్ణోగ్రతలు విపరీతంగా ఊగిసలాడడం వల్ల అక్కడున్న ఉప్పునీరు ఆవిరైపోయి, కొత్తగా ఏర్పడిన ఇతర ఖనిజాలను విడిచిపెట్టి, తర్వాత ఇసుక రేణువుల మధ్య సిమెంట్ చేసి, వాటిని క్రస్ట్‌గా ఏర్పర్చి ఉండవచ్చని భావిస్తున్నారు.

‘ఏదేమైనా అంగారక గ్రహంలోని వాతావరణం దాని పరిణామ చరిత్రను అర్థం చేసుకోవడానికి, నివాసయోగ్యమైన పర్యావరణం కోసం వెతకడానికి సంబంధించిన భవిష్యత్తు అన్వేషణకు కీలకమైన ఆధారాలను అందిస్తుంది’ అని చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ (CAS) ప్రొఫెసర్ క్విన్ జియాంగ్ (QIN Xiaoguang) అన్నారు. ఇతను తన బృందం కలిసి జురాంగ్ రోవర్, నావిగేషన్, టెర్రైన్ కెమెరా (NaTeCam), మల్టీస్పెక్ట్రల్ కెమెరా (MSCam) దాని మార్స్ సర్ఫేస్ కంపోజిషన్ డిటెక్టర్ (MarScoDe) ద్వారా పొందిన డేటాను విశ్లేషించారు.

దిబ్బ ఉపరితల పొరలో హైడ్రేటెడ్ సల్ఫేట్లు, హైడ్రేటెడ్ సిలికా, ఐరన్ ఆక్సైడ్ ఖనిజాలు, బహుశా క్లోరైడ్‌లు పుష్కలంగా ఉన్నాయని వారి అధ్యయనంలో తేలింది. అయితే అంగారక గ్రహంపై గల ఇసుకమేట ఉపరితల లక్షణాలు శీతలీకరణ సమయంలో ఉప్పు-కలిగిన దిబ్బలపై మంచు కరగడం ద్వారా ఏర్పడిన లిక్విడ్ సెలైన్, అక్కడె ఎక్కడో ఒకచోట నీరు ఉందనడానికి బలం చేకూర్చుతున్నాయని సైంటిస్టులు అంటున్నారు.

ఇవి కూడా చదవండి:

వడగళ్లు ఎలా ఏర్పడతాయి.. అవి అంత ప్రమాదమా..?

Advertisement

Next Story

Most Viewed