- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈ ఐదు జీరో క్యాలరీ డ్రింక్స్‌తో బరువు సమస్యకు చెక్ పెట్టండి..!
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత రోజుల్లో చాలామంది ఊబకాయం, అదనపు కొవ్వు సమస్యతో తెగ ఇబ్బందిపడిపోతున్నారు. బరువు పెరగడం పెద్ద సమస్యగా మారిపోయింది. ఎంతో మంది వెయిట్ లాస్ అవ్వడం కోసం పలు ఎక్సర్సైజులు, డైట్ మెయింటైన్ చేస్తుంటారు. వెయిట్ లాస్ అవ్వడం కోసం జంక్ ఫుడ్ అండ్ ఎక్కువగా షుగర్ పదార్థాలు తీసుకోవడం మానేయ్యాలని తరచూ నిపుణులు చెబుతూనే ఉంటారు.
పుష్కలంగా నీరు తాగితే బరువు తగ్గే అవకాశాలు ఉంటాయి. మీ ఆహారంలో ఫైబర్ జోడించడం వల్ల కూడా బరువు తగ్గే చాన్స్ ఉంటుంది అంతేకాకుండా తాజాగా నిపుణులు చెప్పిన ఈ జీరో క్యాలరీ డ్రింక్స్ తీసుకుంటే సులువుగా బరువు తగ్గొచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
పుచ్చకాయ జ్యూస్..
పుచ్చకాయలో కేలరీలు తక్కువగా ఉంటాయి. దీంతో శరీరానికి చాలా తక్కువ కేలరీలు అందుతాయి. అలాగే ఈ జ్యూస్ ఆకలిని అదుపులో ఉంచుతుంది. దీంతో ఈజీగా బరవు తగ్గవచ్చు.
నిమ్మకాయ రసం..
నిమ్మరసం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇమ్యూనిటి పవర్‌తో పాటు గుండె జబ్బలు, మూత్రపిండాల్లో రాళ్ల సమస్యలను నివారిస్తాయి. నిమ్మకాయ రసంలో తక్కువ మొత్తంలో కేలరీలు లభించడం వల్ల వెయిట్ లాస్ అవ్వొచ్చు.
అరటిపండు స్మూతీ-పాలు
అరటిపండు స్మూతీ పాలు తాగితే ఈజీగా వెయిట్ లాస్ అవుతారు. ఇందులో కూడా చాలా తక్కువ మొత్తంలో కేలరీలు ఉంటాయి. అలాగే బనానా తింటే ఎక్కువ సేపు ఆకలి వేయదు. కడుపు నిండిన భావన కలిగి ఉంటుంది.
జామకాయ జ్యూస్..
జామకాయలో పుష్కలంగా పోషకాలు, విటమిన్లు, పీచు పదార్థం వంటి గుణాలు ఉంటాయి. ఇది కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. జామలో కొవ్వు, క్యాలరీలు తక్కువగా ఉంటాయి. కాగా బరువు తగ్గాలనుకునే వారికి జామపండు మేలు చేస్తుంది.
పసుపు -పాలు
పాలలో పసుపు యాడ్ చేసుకుని తాగితే చర్మ సౌందర్యానికి సహాయపడుతుంది. ఏదైనా గాయమైనప్పుడు పసుపును ప్రథమ చికిత్స ట్రీట్ చేస్తాం. జీర్ణకోశ సమస్యలకు, శ్వాసకోశ సమస్యలను, కొలెస్ట్రాల్‌ను తొలగించడంలో, క్యాన్సర్ ముప్పు నుంచి తప్పించడంలో పసుపు సహాయపడుతుంది. పసుపుతో కాలేయానికి రక్షగా చెప్పుకుంటారు. కాగా పసుపు పాలు తీసుకుంటే తొందరగా వెయిట్ లాస్ అవ్వొచ్చు.
గమనిక: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.
Read More..