Divorce: విడాకుల తర్వాత మళ్లీ అదే వ్యక్తిని పెళ్లి చేసుకోవచ్చా.. అసలు చట్టం ఏం చెపుతోంది..?

by Kavitha |
Divorce: విడాకుల తర్వాత మళ్లీ అదే వ్యక్తిని పెళ్లి చేసుకోవచ్చా.. అసలు చట్టం ఏం చెపుతోంది..?
X

దిశ, ఫీచర్స్: సాధారణంగా భార్య భర్తల మధ్య గొడవలు జరగడం కామన్. కానీ, కొన్ని సార్లు అవి విడాకులకు దారితీస్తుంటాయి. అనంతరం వారు విడిపోతూ ఉంటారు. అయితే చాలా మంది విడిపోయిన తర్వాత కూడా ఆ వ్యక్తినే తమ జీవితంలోకి తిరిగి రావాలని కోరుకుంటారు. అయితే అలా విడిపోయిన మనిషితో మనం తిరిగి వాళ్లతో జీవితాన్ని ప్రారంభించవచ్చా? లేదా?. అసలు దీనికి సంబంధించి భారత చట్టంలో ఉన్న నిబంధన ఏమిటి. మన చట్టం ఏం చెబుతోంది..? హిందూ వివాహ చట్టం ప్రకారం ఇది అనుమతించబడుతుందా..? దీని గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం.

విడాకులు పొందడానికి చట్టపరమైన ప్రక్రియ ఉంటుంది.. దీని కోసం మొదట న్యాయవాది ద్వారా కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేయాలి. అనంతరం కోర్టు దానిని విచారిస్తుంది.. ఆ తర్వాత విడాకుల ప్రక్రియ పూర్తవుతుంది.

హిందూ వివాహ చట్టం 1955లో అమల్లోకి వచ్చింది. హిందువులు ఒక్కసారి మాత్రమే వివాహం చేసుకోవడానికి అనుమతి ఉంది. ఒక వ్యక్తి పునర్వివాహం చేసుకోవాలనుకుంటే.. అతను తన మొదటి భాగస్వామికి విడాకులు ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడే అతను మళ్లీ పెళ్లి చేసుకోగలుగుతాడు.

హిందూ వివాహ చట్టం ప్రకారం విడాకులు తీసుకున్న జంటలు మళ్లీ కలిసి జీవించవచ్చు. అయితే విడాకుల తర్వాత భార్యాభర్తలు వేరే వారిని పెళ్లి చేసుకుంటే మళ్లీ కలిసి ఉండటం కష్టమే.

ఎవరైనా కలిసి జీవించాలనుకుంటే, హిందూ వివాహ చట్టంలో దీనిపై ఎలాంటి ఆంక్షలు లేవు. కానీ మీరు వేరే మతానికి చెందినవారైతే, ఆ మతం యొక్క చట్టం ప్రకారం వివాహం చేసుకునే హక్కును పొందుతారు.

Advertisement

Next Story

Most Viewed