Coconut Water: కొబ్బరి నీళ్లు చలికాలంలో తాగొచ్చా? నిపుణులు ఏం చెబుతున్నారంటే?

by Prasanna |
Coconut Water: కొబ్బరి నీళ్లు చలికాలంలో తాగొచ్చా? నిపుణులు ఏం చెబుతున్నారంటే?
X

దిశ, వెబ్ డెస్క్ : మనం ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవాలి. మన ఎదుగుదలకు దోహదపడే అనేక రకాల పోషకాలు కొబ్బరి నీళ్లలో ( coconut water) ఉంటాయి. ఇవి ఎన్నో రకాల వ్యాధులను తగ్గిస్తాయి. ఇవి బెస్ట్ హైడ్రేట్ డ్రింక్ కావడంతో వీటిని సమ్మర్ లో ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే, మనలో కొందరికి శీతాకాలంలో కొబ్బరి నీళ్లు తాగొచ్చా లేదనే అనే సందేహం ఉంటుంది. దీని గురించి నిపుణులు ఏం చెబుతున్నారో ఇక్కడ చూద్దాం..

కొబ్బరి నీళ్లు తాగడం వలన శరీరం హైడ్రేట్‌గా ఉంటుంది. ఇవి అనేక రకాల వ్యాధుల్నించి రక్షణ పొందేలా చేస్తుంది. దీనిలో ఉండే ఎలక్ట్రోలైట్స్, శరీరాన్ని హైడ్రేట్ చేస్తాయి. కానీ, చలికాలంలో తాగకూడదని అనుకుంటారు. కానీ, ఇది తప్పు అని నిపుణులు చెబుతున్నారు. రోజూ తాగడం వలన జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఎసిడిటీ, కడుపు నొప్పి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను దూరం చేస్తుంది. చలికాలంలో కొబ్బరి నీళ్లు తాగడం వల్ల రక్తపోటు, గుండె వ్యాధులు తగ్గిపోతాయి.

అంతే కాకుండా, కొందరికి ఇమ్యూనిటీ పవర్ తగ్గుతుంటుంది. అలాంటి సమయంలో కొబ్బరి నీళ్లు తాగడం ద్వారా ఇమ్యూనిటీ పెంచుకోవచ్చు. కాబట్టి, కొబ్బరి నీళ్ళను సీజన్‌తో సంబంధం లేకుండా ఎప్పుడైనా తాగొచ్చని, శరీరానికి హాని కలగదని నిపుణులు అంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed