Beauty tips: రాత్రి పడుకునే ముందు ఇలా చేయండి.. మరుసటి రోజు ఇక!

by Javid Pasha |   ( Updated:2024-09-05 12:39:45.0  )
Beauty tips: రాత్రి పడుకునే ముందు ఇలా చేయండి.. మరుసటి రోజు ఇక!
X

దిశ, ఫీచర్స్ : తాము అందంగా, యవ్వనంగా అనిపించాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. స్కిన్ గ్లోయింగ్ పెంచుకోవాలని ఆరాట పడుతుంటారు. అందుకోసం రకరకాల స్కిన్ టానింగ్, ఫేషియల్స్ ట్రై చేస్తుంటారు. అమ్మాయిలైతే ఎప్పటికప్పుడు ఫేసియల్స్ చేయించుకుంటూ ఉంటారు. అందుకోసం ప్రతిసారీ బ్యూటీ పార్లర్‌కు వెళ్లడంతో ఖర్చు పెరిగిపోతుంది. దీనిని తగ్గించుకోవాలనుకునే వారికి ఇంట్లోనే సొంతంగా, సులభంగా చేసుకోగల ఫేషియల్స్, పాటించగలిగే చిట్కాలు ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు. అవేంటో చూద్దాం.

* రాత్రి పడుకునే ముందు ముఖాన్ని శుభ్రంగా కడుక్కోండి. తర్వాత డీ టాన్ ప్యాక్ చేయండి. అంటే ముఖంపై ఉన్న జిడ్డును పోగొట్టుకోవాలి. అందుకోసం ఇంట్లో దొరికే పదార్థాలతోనే ముఖం టానింగ్ చేసుకోవచ్చు అంటున్నారు నిపుణులు. అందుకోసం ఒక టేబుల్ స్పూన్ పాలు, రోజ్ వాటర్, అలోవెరా జెల్ మిక్స్ చేసి, ఆ మిశ్రమాన్ని ముఖానికి అప్లయ్ చేయాలి. కాసేపటి తర్వాత నీళ్లతో శుభ్రంగా కడుక్కోవాలి. రెగ్యులర్‌గా ఇలా చేస్తూ ఉంటే మీ చర్మం యవ్వనంగా కనిపిస్తుంది.

* మరొక చిట్కా ఏంటంటే.. బియ్యపు పిండిలో పెరుగు, టొమాటో గుజ్జు వేసి బాగా కలపాలి. తర్వాత ముఖానికి పట్టించాలి. ఏడెనిమిది నిమిషాలు మసాజ్ చేసిన తర్వాత శుభ్రంగా కడగాలి. ఇలా చేశాక రాత్రి కంటి నిండా నిద్రపోవాలి. ఇక తెల్లారి మీ ముఖం నిగనిగలాడుతుంది.

* నిద్రకు ముందు ముల్తానీ మట్టి, గంధం పొండి, పాలు, తేనె మిక్స్ చేసి ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవాలి. తర్వాత దీనిని ముఖంపై అప్లయ్ చేయాలి. బాగా ఆరిన తర్వాత గానీ, జాగ్రత్తగా పడుకుంటే ఉదయం గానీ ముఖాన్ని కడుక్కోవాలి. ఆ తర్వాత మీ ముఖం ఎంతో అందంగా మెరిసిపోతుందని నిపుణులు చెప్తున్నారు.

*నోట్: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించడం లేదు. అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story

Most Viewed