- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పాలు ఒక్కసారి కంటే ఎక్కువ సార్లు మరిగిస్తున్నారా.. నిపుణులు ఏమి చెబుతున్నారంటే..?
దిశ, ఫీచర్స్: పాలు ఆరోగ్యానికి మంచివని మనందరికి తెలుసు. మన ఎముకలు, శరీర ఆరోగ్యానికి పాలు చాలా ముఖ్యమైనవి. దీనిలో ఉండే కాల్షియం, పోషకాలు మీ శరీరాన్ని బలోపేతం చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. చాలా మందికి వాటిని ఎలా మరిగించాలో తెలియదు. కొంత మంది పాలను చిక్కగా చేయడానికి ఎక్కువసేపు మరిగిస్తారు. ఇలాంటి సందర్భాల్లో పాలను మళ్లీ మళ్లీ మరిగించడాన్ని కొందరు తప్పు పడుతుంటారు. అందుకే.. కొందరు పాలు పెట్టిన కొంచం సేపటికి గ్యాస్ ను తగ్గించి నెమ్మదిగా మరిగిస్తుంటారు. పాలలో కాల్షియం, ప్రొటీన్లు, విటమిన్లు మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది మీ శరీరానికి కూడా పోషణనిస్తుంది. పాలు తాగడం వల్ల శరీరం బలంగా తయారవుతుంది. అయితే, పాలు మరిగేటప్పుడు కొన్ని పొరపాట్లు జరుగుతాయి. ఇవి అస్సలు చేయకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పాలు ఎంత తరచుగా మరిగించాలో చాలా మందికి తెలియదు. అసలు పాలను ఎలా మరిగించాలో ఇక్కడ తెలుసుకుందాం..
పాలు మరిగించే విధానం గురించి ఇక్కడ చూద్దాం..
పాలను ఎక్కువ సేపు మరిగిచటం లేదా పదేపదే మరగబెట్టడం వల్ల పోషకాలు నాశనం అవుతాయని చాలా అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది పాలు యొక్క అన్ని ప్రయోజనాలను పొందకుండా శరీరాన్ని నిరోధిస్తుంది. పాలు మరిగించడానికి సరైన మార్గం ఏమిటంటే, దానిని గ్యాస్ మీద ఉంచి, ఒక గరిటె తీసుకుని నిరంతరం కదిలిస్తూ ఉండండి.
పాలు మరిగిన తర్వాత మళ్లీ మళ్లీ మరిగించడకూడదు. ఇలా ప్రతీ సరి పాలు వేడి చేయడం వలన దానిలో ఉండే పోషకాలు నశించిపోతాయని నిపుణులు చెబుతున్నారు. ఒక్కసారి మాత్రమే పాలు మరిగించాలి. పాలు విరిగిపోతాయని అనిపించిపించనప్పుడు మళ్లీ మరిగించవచ్చని నిపుణులు అంటున్నారు.