FIR Filed: మీడియా ప్రతినిధిపై దాడి.. మోహన్‌బాబుపై కేసు నమోదు

by Shiva |   ( Updated:2024-12-11 04:07:23.0  )
FIR Filed: మీడియా ప్రతినిధిపై దాడి.. మోహన్‌బాబుపై కేసు నమోదు
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని జల్‌పల్లి (Jalpally)లో మోహన్ బాబు(Mohan Babu) నివాసం వద్ద మంగళవారం రాత్రి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇంట్లోకి వెళ్లేందుకు మనోజ్, మౌనిక దంపతులు ప్రయత్నించగా సెక్యూరిటీ సిబ్బంది వారిని అడ్డుకున్నారు. అనంతరం సెక్యూరిటీతో మనోజ్ (Manoj) వాగ్వాదానికి దిగి గేట్లు తోసుకుని మరీ లోపలికి వెళ్లారు. ఈ క్రమంలోనే కవరేజీ కోసం లోనికి వెళ్లిన మీడియా ప్రతినిధులను మోహన్ బాబు దుర్భాషలాడుతూ.. ఓ ప్రముఖ మీడియా ప్రతినిధిపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై తెలంగాణ జర్నలిస్ట్ సంఘాలు, రాజకీయ, సినీ ప్రముఖులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా, మీడియా ప్రతినిధిపై దాడి ఘటనలో మోహన్‌బాబుపై పహాడీ షరీఫ్ పోలీసులు 118 బీఎన్ఎస్ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ఒకవేళ నేరం నిరూపితం అయితే ఆయనకు మూడేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది.


👉 Follow us on WhatsApp Channel
👉 Follow us on Sharechat


Next Story

Most Viewed