Shobhitha: పెళ్లిలో ఆ స్టార్ హీరో సూపర్ హిట్ సాంగ్‌కు కిర్రాక్ స్టెప్పులు వేసిన అక్కినేని కోడలు.. (వీడియో)

by Kavitha |   ( Updated:2024-12-12 15:52:04.0  )
Shobhitha: పెళ్లిలో ఆ స్టార్ హీరో సూపర్ హిట్ సాంగ్‌కు కిర్రాక్ స్టెప్పులు వేసిన అక్కినేని కోడలు.. (వీడియో)
X

దిశ, సినిమా: అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya) సమంత(Samantha)తో విడాకుల తర్వాత స్టార్ హీరోయిన్ శోభిత(Shobitha)తో డేటింగ్‌లో ఉంటూ ఆగస్టులో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న సంగతి తెలిసింది. ఈ విషయాన్ని నాగార్జున(Nagarjuna) తన ఎక్స్(X) వేదికగా ప్రకటించాడు. ఇక అప్పటినుంచి వీరి పెళ్లి ఎప్పుడెప్పుడు అవుతదా అని ఈగర్‌గా వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్‌కు శోభిత.. పసుపు దంచుట కార్యక్రమం అంటూ పెళ్లిపై హింట్ ఇచ్చేసింది. ఇక అప్పటినుంచి తన మ్యారేజ్‌కి సంబంధించిన ప్రతి అప్డేట్ ఇస్తూ వచ్చింది. అలా డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోస్‌లో నాగచైతన్య- శోభిత ధూళిపాళలు వివాహ బంధంతో ఒకటయ్యారు. ఇక ఈ విషయాన్ని నాగ్ మళ్లీ తన ఎక్స్ వేదికగా ప్రకటిస్తూ చై- శోభితల మ్యారేజ్ ఫొటోస్ షేర్ చేశాడు. దీంతో ఈ పిక్స్ కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ క్రమంలో అక్కినేని కోడలు శోభితకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. శోభిత పెళ్లి రోజు మెకప్ గదిలో అందంగా రెడీ అవుతుంది. అప్పుడు.. ఆమె ‘శ్రద్ధా నా పెళ్లవుతోంది. నాకు సిగ్గేస్తోంది’ అంటూ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన ‘సరైనోడు’(Sarrainodu) సినిమాలోని బ్లాక్ బస్టర్(Blockbuster) అనే సాంగ్‌కు మాస్ స్టెప్పులు వేస్తూ అక్కడున్న వారిని ఫిదా చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ హల్‌చల్ చేస్తోంది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు.. అక్కినేని కోడలు భలే డ్యాన్స్‌లు చేస్తుందని, మొత్తానికి శోభిత మాత్రం పెళ్లిని ఫుల్ ఎంజాయ్ చేసిందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed