Body language: బాడీ లాంగ్వేజ్ మీ వ్యక్తిత్వాన్ని చెప్పేస్తుంది..! అదెలాగో తెలుసా..?

by Kanadam.Hamsa lekha |   ( Updated:2024-12-06 15:59:45.0  )
Body language: బాడీ లాంగ్వేజ్ మీ వ్యక్తిత్వాన్ని చెప్పేస్తుంది..! అదెలాగో తెలుసా..?
X

దిశ, ఫీచర్స్: ఎదుటి వారు ఎలాంటి వారో తెలుసుకోవాలనే ఆస్తకి చాలామందికి ఉంటుంది. అయితే, వాళ్ల గురించి.. వారి వ్యక్తిత్వాన్ని గురించి తెలుసుకోవాలని అనుకుంటే.. వారితో కొంత సమయం మాట్లాడడం లేదా గడపడం వంటివి చేయాలని అనుకుంటారు. ప్రతీ శరీరానికి ఒక భాష ఉంటుంది. దాని ఆధారంగా కూడా ఎదుటి వ్యక్తి గురించి తెలుసుకోవచ్చు. ఎదుటివారి బాడీ లాంగ్వే్జ్‌ను బట్టి వారు ఎలాంటి వారు? వారి వ్యక్తిత్వం ఏమిటి? అనేది తెలుసుకోవచ్చు. కొందరు మాట్లాడుతున్నప్పుడు ఆసక్తికరంగా వినాలని అనిపిస్తుంది. మరికొందరు ఏం మాట్లాడినా వెంటనే చిరాకు వస్తుంది. దానికి కారణం వాళ్ల బాడీ లాంగ్వేజ్ విధానం సరిగా లేదని అర్థం.

అయితే, చాలామందికి దీనిపై సరైన అవగాహన ఉండదు. కొందరికి వాళ్ల శరీరం ఎలా ప్రవర్తిస్తుందో పెద్దగా గుర్తించలేకపోతారు. ఎవరైనా సరే నీ బాడీ లాంగ్వేజ్ సరిగా లేదని చెప్పగానే వెంటనే బాధపడుతుంటారు. తాము ఎందుకు పనికిరామని అనుకుని, ఆందోళన చెందుతారని నిపుణులు చెబుతున్నారు. మీరు అందరిలో ప్రత్యేకంగా, సమర్థవంతమైన వ్యక్తిగా నిలవాలంటే దానికి మీ బాడీ లాంగ్వేజ్ ప్రధానమని తెలుసుకోవాలి. శరీర భంగిమ ఆధారంగా మీ మూడ్ ఏంటో ఎదుటివారికి తెలుస్తుందని నిపుణులు చెబుతున్నారు.

* మీతో మాట్లాడుతున్నప్పుడు ఎదుటి వ్యక్తి పదే పదే ముక్కు మీద లేదా తలపై రుద్దుకోవడం వంటిది చేస్తుంటే వారు మిమ్మల్ని వ్యతిరేకమైన దృష్టితో చూస్తున్నారని అర్థం చేసుకోవచ్చు.

* మాట్లాడేటప్పుడు మీ కళ్లల్లోకి సూటిగా చూస్తూ.. మిమ్మల్ని ఇబ్బంది పడేలా చేస్తున్నారంటే వారు మీతో అబద్ధం చెబుతున్నారని. అలా కాకుండా రెప్పవేయకుండా అలాగే చూస్తున్నట్లైతే మిమ్మల్ని పరిశీలిస్తున్నారని అర్థం. ఎదుటి వ్యక్తి మనల్ని చూసే చూపుతో కూడా వారు ఎలాంటి వారనేది తెలుసుకోవచ్చు.

* మాట్లాడుతున్నప్పుడు పదే పదే చుట్టు పక్కలకి చూడడం లేదా ఏదైనా వస్తువులను కదిలించడం వంటివి చేస్తుంటే ఆ వ్యక్తి నిర్ణయాలు తీసుకోవడంలో వెనకబడి ఉన్నాడని అర్థం.

* చేతులు కట్టుకుని నిలబడితే అది ఎదుటి వ్యక్తికి ఇస్తున్న గౌరవంగా భావించాలి. మీరు మాట్లాడుతున్నప్పుడు ఎదుటి వ్యక్తి చేతులు వెనక్కి కట్టుకున్నట్లైతే అతను మీరే చెప్పే విషయంపై విసుగు చెందుతున్నాని అర్థం.

* ఎదుటి వ్యక్తి పొగుడుతున్నప్పుడు లేదా మెచ్చుకుంటున్నప్పుడు తలను వంచితే ఆ వ్యక్తికి ఆత్మవిశ్వాస లోపం ఉందని అర్థం. ప్రతీ విషయానికి సిగ్గుపడతారని అర్థం చేసుకోవచ్చు.

* మీరు ఎదుటి వారితో మాట్లాడుతున్నప్పుడు వారు తలను ఊపుతూ మీ కళ్లల్లోకి చూస్తున్నట్లైతే.. మీరు మాట్లాడే విషయంపై వారికి ఆస్తకి ఉందని అర్థం. అలా కాకుండా మరీ ఎక్కువగా తలను ఊపుతున్నారంటే.. వారికి మీరు మాట్లాడే విషయంపై ఆసక్తి లేదని అనుకోవాలి. ఇలా ఇష్టం లేకపోయినా వారు వింటున్నారంటే మిమ్మల్ని బాధపెట్టడం ఇష్టంలేకేనని అనుకోవాలి.

* ఎదుటి వ్యక్తి మీరు మాట్లాడుతున్నప్పుడు వంగిపోతూ, తడుముకుంటూ చేస్తున్నారంటే ఆ వ్యక్తి వెళ్లిపోవాలని అనుకుంటున్నారని అర్థం చేసుకోవాలి.

*గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు.

Read More...

Ragging : కాలేజీల్లో అకృత్య క్రీడ.. జూనియర్ల ప్రాణాలు తీస్తున్న ర్యాగింగ్






Next Story