కళ్లు లేకపోతేనేం.. ఎక్స్‌ట్రా సెన్సిటివ్ వైబ్రేషన్స్‌‌తో కాంతిని గ్రహిస్తున్న బ్లైండ్ ఫిషెస్

by Prasanna |
కళ్లు లేకపోతేనేం.. ఎక్స్‌ట్రా సెన్సిటివ్ వైబ్రేషన్స్‌‌తో కాంతిని గ్రహిస్తున్న బ్లైండ్ ఫిషెస్
X

దిశ, ఫీచర్స్ : మెక్సికన్ చీకటి గుహల్లోని నీటిలో నివసించే ఒక రకమైన బ్లైండ్ ఫిషెస్ కళ్లు కనబడకపోయినా కాంతిని గ్రహించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయని పరిశోధకులు అంటున్నారు. ఇవి చాలా తక్కువగా నిద్రపోతుంటాయని చెప్తున్నారు. యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్‌‌కు చెందిన మెరైన్ బయాలజిస్టు ఇంగా స్టెయిండాల్ నేతృత్వంలోని పరిశోధకులు చేపలు తమ శరీరాలను కాలానుగుణంగా ఎలా నియంత్రించుకుంటాయనే కోణంలో అధ్యయనం కొనసాగించారు. ఈ సందర్భంగా వారు భూమిపై ఉన్న చాలా జంతువులు ఈ విధమైన జీవ గడియారాన్ని ఉంటాయని, తమ శరీరాలను చీకటి, వెలుతురు, పగలు, రాత్రి వంటి కాల చక్రాలకు అనుగుణంగా సమకాలీకరించడానికి కాంతి స్థాయిలను ఉపయోగించే సిర్కాడియన్ రిథమ్స్‌ను అనుసరిస్తాయని కనుగొన్నారు.

బ్లైండ్ ఫిషెస్ రిథమిక్ లైఫ్ కూడా వాటి బిహేవియర్స్‌ను నిర్దేశించే వివిధ జీవ ప్రక్రియల ద్వారా కొనసాగుతుందని పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది. ఉదాహరణకు హంగర్ సైకిల్ వాటిలో తినాలనే కోరికను ప్రేరేపిస్తుంది. మెలటోనిన్ లెవల్స్ మగత చక్రం(drowsy cycle) పట్ల అప్రమత్తం చేస్తాయి. అలాగే 30కి పైగా ఐసోలేటెడ్ గుహల సముదాయంలో నివసిస్తున్న మెక్సికన్ బ్లైండ్ కేవ్ ఫిషెస్ (ఆస్టియానాక్స్ మెక్సికనస్) కూడా చీకటికి అనుగుణంగా జీవిస్తూనే కాంతిని గ్రహించే అద్భుతమైన తెలివిని, సామర్థ్యాన్ని కలిగి ఉంటున్నాయని పరిశోధకులు వెల్లడించారు. వీటి శరీరాలు ఎక్స్‌ట్రా సెన్సిటివ్ వైబ్రేషన్స్‌ను కలిగి ఉండటంవల్ల ఇది సాధ్యం అవుతుందని చెప్తున్నారు. కాంతిని గ్రహించడంలో, నీటి ప్రవాహాలలో నావిగేషన్ మార్పులకు అనుగుణంగా వ్యవహరించడంలో బ్లైండ్ ఫిషెస్ శరీరంలోని ఎక్స్‌ట్రా సెన్సిటివ్ వైబ్రేషన్స్‌ దోహదం చేస్తాయి.

Advertisement

Next Story