Bleeding eye virus : ముంచుకొస్తున్న ముప్పు..! ప్రాణాంతకంగా మారుతున్న బ్లీడింగ్ ఐ వైరస్

by Javid Pasha |   ( Updated:2024-12-03 08:05:00.0  )
Bleeding eye virus : ముంచుకొస్తున్న ముప్పు..! ప్రాణాంతకంగా మారుతున్న బ్లీడింగ్ ఐ వైరస్
X

దిశ, ఫీచర్స్ : కరోనా మహమ్మారి సృష్టించిన మారణ హోమాన్ని మర్చిపోకముందే మరో ముప్పు తరుముకొస్తోంది. అత్యంత ప్రమాదకరమైన మార్బర్గ్ వైరస్ ఇప్పుడు ఆఫ్రికన్ కంట్రీ అయిన రువాండాలో విధ్వంసం సృష్టిస్తోంది. దీని బారిన పడి ఇప్పటికే 15 మంది మరణించారు. వందలాది మందికి వైరస్ సోకి ఉంటుందని అనుమానిస్తున్నారు. పొంచి ఉన్న ముప్పును దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా హెచ్చరిక జారిచేసింది. మార్బర్గ్ వైరస్ ( Marburg virus) సోకితే బాధితుల కళ్ల నుంచి రక్తం కారడం ప్రారంభం అవుతుంది. దీని కారణంగానే ఈ వైరస్‌కు బ్లీడింగ్ ఐ వైరస్ (Bleeding eye virus) అని కూడా పిలుస్తున్నారు. కాగా ఈ వైరస్‌ను మొదటిసారి 1961లో జర్మనీలోని ఫ్రాంక్ ఫర్ట్‌లో కనుగొన్నారు.

వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్(WHO) ప్రకారం.. మార్బర్గ్ వైరస్ ఎబోలా ఫ్యామిలీకి చెందినది. ఇది వైరల్ హెమరేజిక్ ఫీవర్‌(Hemorrhagic fever)కు కారణం అవుతుంది. ఇది సోకిన తర్వాత ప్రజల రక్త నాళాలను దెబ్బతీస్తుంది. అంతర్గత రక్త స్రావానికి, ముఖ్యంగా కళ్లల్లో రక్తం కారడానికి కారణం అవుతుంది. కాగా ఇది జూనోటిక్ వైరస్ అని నిపుణులు పేర్కొంటున్నారు. ఇది జంతువుల నుంచి మనుషులకు వ్యాపిస్తుంది. మొదట గబ్బిలాల నుంచి ఉద్భవిస్తుంది. వాటి యూరిన్, లాలా జలం లేదా రక్తం ద్వారా కూడా మానవులకు వ్యాపిస్తుంది.

లక్షణాలు

మార్బర్గ్ వైరస్ లక్షణాలు కూడా ఎబోలా వైరస్ మాదిరిగానే ఉంటాయి. ఇది సోకిన తర్వాత బాధిత వ్యక్తుల్లో తీవ్రమైన జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పి, వాంతులు, శరీరంపై దద్దుర్లు వంటివి కనిపిస్తాయి. ఇన్‌ఫెక్షన్ ఎక్కువై అంతర్గత రక్త స్రావం, అవయవ వైఫల్యం సంభవిస్తాయి. ఆకస్మికంగా బరువు తగ్గడం, ముక్కు, కళ్లు, నోరు లేదా మహిళల్లో అయితే యోని నుంచి రక్త స్రావం అయ్యే అవకాశం ఉంటుందని డబ్ల్యుహెచ్‌ఓ ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.

ట్రీట్మెంట్ ఉందా?

నిపుణుల ప్రకారం.. మార్బర్గ్ వైరస్‌కు కచ్చితమైన ట్రీట్మెంట్ అయితే ప్రజెంట్ అందుబాటులో లేదు. కాగా దీని డెత్ రేట్ 24 నుంచి 88 శాతం వరకు ఉండవచ్చునని పేర్కొంటున్నారు. లక్షణాల ఆధారంగా అందుబాటులో ఉన్న సాధారణ చికిత్సలను అందిస్తారు. కాగా వ్యాక్సిన్ తయారీ కూడా ప్రాథమిక దశలో ఉన్నట్లు చెబుతున్నారు. మార్బర్గ్ వైరస్ సోకిన బాధితులతో లైంగి చర్యల ద్వారా కూడా ఇది వ్యాపిస్తుంది. లాలాజలం, ఇతర శరీర ద్రవాల ద్వారా కూడా ఇతరులకు సోకుతుంది. కాబట్టి ఈ వైరస్ బాధితులకు దూరం పాటించాలని, కరోనా టైమ్‌లో మాదిరి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

👉 Download our Android App
👉Download our IOS App
👉Follow us on Instagram
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story

Most Viewed