Black Wheat : ఔషధ గుణాల నల్ల గోధుమ.. ఇలా చేస్తే ఆ సమస్యలు పోయినట్టే!

by Javid Pasha |   ( Updated:2024-10-18 14:39:41.0  )
Black Wheat : ఔషధ గుణాల నల్ల గోధుమ.. ఇలా చేస్తే ఆ సమస్యలు పోయినట్టే!
X

దిశ, ఫీచర్స్ : తెల్లగా ఉండే గోధుమల గురించి అందరికీ తెలిసిందే. వీటి రవ్వతో ఉప్మా, పిండితో చపాతీలు చేస్తారు. అయితే నల్ల గోధుమల గురించి, వాటి ఉపయోగాల గురించి మీరెప్పుడైనా విన్నారా? చాలామందికి తెలియపోవచ్చు కానీ బ్లాక్ గోల్డ్ అని కూడా పిలిచే ఈ నల్లటి గోధుమల్లో పలు ఔషధ గుణాలు ఉంటాయని, ఆరోగ్యానికి చాలా మంచిదని పోషకాహార నిపుణులు అంటున్నారు. ఇంకా ఏయే బెనిఫిట్స్ ఉంటాయో చూద్దాం.

తెల్లటి గోధుమలతో పోలిస్తే.. నల్ల గోధుముల్లో పోషకాలు అధికం. వీటిలో అధిక మొత్తంలో వర్ణద్రవ్యం ఉంటుంది. పైగా రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఇది కీలకపాత్ర పోషిస్తుంది. నల్ల గోధుమల్లో ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి. హెల్తీ ఫ్యాట్, జింక్, ఐరన్, కాపర్, ఫైబర్, సెలీనియం, క్యాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఫాస్పరస్, కార్బో హైడ్రేట్లు, విటమిన్లు పుష్కలంగా ఉన్నందువల్ల అనేక వ్యాధులను దూరం చేస్తాయి. కాబట్టి ఆహారంలో భాగంగా నల్ల గోధుమలు తరచుగా వాడేవారిలో డయాబెటిస్, క్యాన్సర్, గుండె జబ్బులు వంటివి రాకుండా ఉంటాయని పోషకాహార నిపుణులు చెప్తున్నారు.

*నోట్ : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story

Most Viewed