బయోనిక్ రీడింగ్.. తక్కువ కాలంలో ఎక్కువ మొత్తం చదవొచ్చు..

by Vinod kumar |   ( Updated:2023-03-09 13:43:01.0  )
బయోనిక్ రీడింగ్.. తక్కువ కాలంలో ఎక్కువ మొత్తం చదవొచ్చు..
X

దిశ, ఫీచర్స్: స్మార్ట్ ఫోన్, సోషల్ మీడియా చేతుల్లో బంధీ అయిపోయిన మనం అకాడమీ బుక్స్, నావెల్స్ చదవాలంటే కష్టంగానే ఉంది. ఒక వేళ పుస్తకం ఓపెన్ చేసినా.. సెల్‌లో నోటిఫికేషన్ టోన్ రింగ్ అయిందంటే చాలు కాన్సంట్రేషన్ మిస్ అయినట్లే.


అయితే అలాంటి ఇబ్బంది లేకుండా చాలా తక్కువ కాలంలో ఎక్కువ మొత్తాన్ని చదివేందుకు ‘బయోనిక్ రీడింగ్’ యాప్ అందుబాటులోకి వచ్చింది. అటెన్షన్ డెఫిసిట్ హైపర్యాక్టివిటీ డిజార్డర్ ఉన్న వ్యక్తులకు ఆశీర్వాదంగా ప్రశంసించబడుతున్న ఈ యాప్.. దాదాపు రెండింతలు వేగం, ఎక్కువ కాన్సంట్రేషన్‌తో చదివేందుకు సహాయపడుతుంది.


ఇది పాఠకులకు వారు చదివేటప్పుడు ఆర్టిఫిషియల్ ఫిక్సేషన్ పాయింట్లతో కళ్లను మళ్లించడం ద్వారా సహాయపడుతుంది. ఈ పద్ధతిని ఉపయోగించి.. రీడర్ హైలైట్ చేయబడిన ప్రారంభ అక్షరాలపై మాత్రమే దృష్టి పెడతాడు. ఇది పాఠకుడి మెదడు మిగిలిన పదాన్ని పూరించడానికి అనుమతిస్తుంది. టెక్స్ట్ యొక్క అత్యంత క్లుప్తమైన భాగాలను హైలైట్ చేస్తుంది.

Also Read...

ఆకుకూరల్లో మేటి గంగ వాయిలి.. ఈ మొక్క ప్రత్యేకత ఇదే..!

Advertisement

Next Story