- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తస్మాత్ జాగ్రత్త.. వేసవిలో ప్రయాణాలు చేస్తున్నారా? అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
దిశ,ఫీచర్స్: సమ్మర్ వచ్చిందంటే చాలు పెళ్లిళ్లు,శుభకార్యాలు,టూర్స్ అనీ ప్రయాణాలు చేస్తుంటాము. దీని వలన ఎండ వేడికి, ఉక్కపోతకు చాలా చిరాకు, నీరసం, అలసట వంటివి వచ్చేస్తాయి. దీంతో దూర ప్రయాణాలు చేసినా పెద్దగా ఎంజాయ్ చేయలేకపోతారు. కాబట్టి ఈ వేసవిలో ఎక్కువగా దూర ప్రయాణాలు చేసేవారు ఖచ్చితంగా కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. దీంతో మీరు అలసిపోకుండా ఉంటారు. మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది. అయితే వేసవిలో ప్రయాణాల విషయంలో ఖచ్చితంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసుకుందాం.
బాడీ డీహైడ్రేట్ కాకుండా చూసుకోవాలి:
ఎండలో ఎక్కువగా తిరగడం వలన మన బాడీలో నీరంతా చెమట రూపంలో బయటకు పోతుంది. దీనివల్ల మనం త్వరగా డీహైడ్రేట్ అయిపోతూ ఉంటాము. కాబట్టి ఎక్కువగా నీళ్లు మధ్య మధ్యలో ఎనర్జీ డ్రింక్స్, ఫ్రూట్ జ్యూసులు, కొబ్బరి నీళ్లు ఇలా ఏదో ఒకటి తీసుకుంటూ ఉంటే.. బాడీ డీహైడ్రేట్ కాకుండా ఉంటుంది.
చర్మాన్ని కాపాడుకోవాలి:
ఎండలో ఎక్కువగా చర్మం దెబ్బ తినే అవకాశాలు ఉంటాయి. ఎండ నేరుగా చర్మంపై పడటం వల్ల త్వరగా చర్మ సమస్యలు వస్తాయి. కాబట్టి అలా జరగకుండా ఉండాలంటే బయటకు వెళ్లినప్పుడు అల్లా ఖచ్చితంగా సన్ స్క్రీన్ లోషన్స్ రాసుకోవడం మంచిది. దీని వల్ల చర్మం దెబ్బతినదు. అలాగే చర్మంపై నేరుగా ఎండ పడకుండా ఉంటుంది.
ఆహారం విషయంలో:
సమ్మర్‌లో ఆరోగ్య పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలో ఆహారం కూడా ఒకటి. ఆయిల్, మసాలా,జంక్ ఫుడ్, వంటి ఆహారాన్ని చాలా తక్కువగా తీసుకోవాలి. శరీరాన్ని చల్లబరిచే పుచ్చకాయ,కీరా,కొబ్బరి బోండాలు వంటి ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకుంటే.. మీ ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. ప్రయాణాలు చేసే సమయంలో ఏవి పడితే అవి తినకూడదు. దీని వల్ల జీర్ణ సమస్యలు తలెత్తి ఇబ్బందులకు గురి చేస్తాయి. కాబట్టి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.