బెస్ట్ ఇమ్యూనిటీ బూస్టర్ డ్రింక్.. వీక్లీ 2 టైమ్స్ తీసుకుంటే రోగాలన్నీ పరార్

by Anjali |
బెస్ట్ ఇమ్యూనిటీ బూస్టర్ డ్రింక్.. వీక్లీ 2 టైమ్స్ తీసుకుంటే రోగాలన్నీ పరార్
X

ఫీచర్స్: రోగనిరోధక శక్తి అనేది మన శరీరానికి ఎంతో ముఖ్యం. బాడీలో ఇమ్యూనిటీ పవర్ ఉంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవు. రోగనిరోధక శక్తి శరీరం యొక్క ప్రతి ముందు భాగంలో బాహ్య ఆక్రమణ సూక్ష్మజీవుల నుంచి రక్షిస్తుంది. ఇది శరీరంలో కణాలు, కణజాలాలు, అవయవాలు, కొన్ని రసాయనాల వెబ్‌ను సృష్టిస్తుంది. కరోనా మహమ్మారి తర్వాత చాలా మంది ప్రజల్లో ఇమ్యూనిటీ పవర్ గురించి అవగాహన వచ్చింది. ఇమ్యూనిటీ సిస్టం స్ట్రాంగ్‌గా ఉంటే రోగాలను ఇట్టే తరిమికొట్టొచ్చు. కాగా రోగనిరోధక శక్తిని పెంచుకునే ఓ అద్భుతమైన డ్రింక్ తీసుకుంటే సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతమవుతుందని తాజాగా నిపుణులు వెల్లడించారు. ఈ డ్రింక్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం..

ఇమ్యూనిటీ పవర్ డ్రింక్ తయారీ విధానం..

ముందుగా ఒక క్యారెట్ తీసుకుని నీటితో శుభ్రంగా కడుక్కుని.. పీల్ తొలగించి ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక ఆరెంజ్ ఫ్రూట్‌ను తీసుకుని, దాని తొక్కను తొలగించాలి. ఇప్పుడు బ్లండర్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలతో సహా ఆరెంజ్ ఫ్రూట్‌ను వేసుకోవాలి. తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన అల్లం ముక్కలు, మూడు మిరియాలు, ఒక గ్లాస్ నీటిని యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఈ జ్యూస్‌ను స్టైనర్ సహాయంతో ఫిల్టర్ చేసుకుంటే ఎంతో టెస్టీగా ఉండే ఇమ్యూనిటీ పవర్ డ్రింక్ రెడీ అయిపోయినట్లే. యాంటి యాక్సిడెంట్స్, విటమిన్ సి పుష్కలంగా ఉండే ఈ డ్రింక్‌ను వీక్లీ 2 సార్లు తీసుకుంటే చాలా హెల్తీగా ఉంటారు.

ఇమ్యూనిటీ పవర్ డ్రింక్ ఉపయోగాలు..

* ఇన్ఫెక్షన్లతో పోరాడే శక్తిని అందిస్తుంది.

* రోగనిరోధక శక్తిని ఫాస్ట్‌గా ఇంప్రూవ్ చేస్తుంది.

* ఈ అద్భుతమైన డ్రింక్‌ను డైట్‌లో యాడ్ చేసుకుంటే కడుపులోని పేగుల ఆరోగ్యం బాగుంటుంది.

* అనేక రోగాలు దరిదాపుల్లోకి రాకుండా అడ్డుకట్ట వేస్తుంది.

* చూపును మెరుగుపరుస్తుంది.

* చర్మం కాంతివంతంగా మారుతుంది.

* వయసు మీద పడుతోన్న యవ్వనంగా కనిపిస్తారు.

* బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను కరిగిస్తుంది.

* హార్ట్ ఎటాక్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి.

Advertisement

Next Story

Most Viewed