ఏడిస్తే ఇన్ని లాభాలున్నాయా?

by Sujitha Rachapalli |
ఏడిస్తే ఇన్ని లాభాలున్నాయా?
X

దిశ, ఫీచర్స్ : ఏడుపు అనేది మానవులకు ప్రత్యేకమైనది. లోతైన విచారం, దుఃఖం నుంచి విపరీతమైన ఆనందం వరకు అనేక రకాల భావోద్వేగాలకు సహజ ప్రతిస్పందన. కాగా ఏడవడం ఆరోగ్యానికి మంచిదా? అంటే సమాధానం అవును అని తెలుస్తోంది. ఏడుపు ఒత్తిడి, మానసిక నొప్పిని విడుదల చేస్తుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. మంచి అనుభూతిని కలిగించే ఆక్సిటోసిన్, ఎండోజెనస్ ఓపియాయిడ్లను విడుదల చేస్తుందని పరిశోధకులు కనుగొన్నారు, ఇవి మానసిక, శారీరక భావోద్వేగ బాధను తగ్గించగలవు.

ఏడుపు వల్ల ప్రయోజనాలు

  • 2014లో జరిపిన అధ్యయనం ఏడుపు స్వీయ-ఓదార్పు ప్రభావాన్ని చూపుతుందని కనుగొంది. పారాసింపథెటిక్ నాడీ వ్యవస్థను సక్రియం చేస్తూ.. రిలాక్స్‌గా ఉండటానికి సహాయపడుతుందని తెలిపింది.
  • ఓదార్పు మాత్రమే కాకుండా ఇతరుల నుండి మద్దతును పొందడంలో సహాయపడుతుంది. 2011 అధ్యయనం ప్రకారం.. ఏడుపు అనేది ప్రధానంగా ఒక అనుబంధ ప్రవర్తన. ఇది మన చుట్టూ ఉన్న వ్యక్తుల నుంచి మద్దతును కూడగట్టుకుంటుంది.
  • ఏడుపు నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. వెల్నెస్ ఫీలింగ్ ను అందిస్తుంది. కన్నీళ్లు కారడం వల్ల ఆక్సిటోసిన్, ఎండార్ఫిన్‌లు విడుదల అవుతాయి. నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి.
  • కన్నీళ్లలో లైసోజైమ్ అనే ద్రవం ఉన్నందున.. ఏడుపు బ్యాక్టీరియాను చంపి, కళ్లను శుభ్రంగా ఉంచుతుంది. అంటే లైసోజైమ్ అంత శక్తివంతమైన యాంటీమైక్రోబయల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఆంత్రాక్స్ వంటి బయోటెర్రర్ ఏజెంట్లు అందించే ప్రమాదాలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.
  • 2016 అధ్యయనం పిల్లలు బాగా నిద్రపోవడానికి ఏడుపు సహాయపడుతుందని కనుగొంది. పెద్దవారిపై అదే నిద్రను మెరుగుపరుస్తుందా అనేది ఇంకా పరిశోధన చేయబడలేదు.
  • ఒక వ్యక్తి రెప్ప మూసిన ప్రతిసారీ విడుదలయ్యే బేసల్ కన్నీళ్లు, కళ్లను తేమగా ఉంచడానికి, శ్లేష్మ పొరలు ఎండిపోకుండా నిరోధించడంలో సహాయపడతాయి. అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆప్తాల్మాలజీ 2023 జర్నల్ ప్రకారం.. బేసల్ కన్నీరు ప్రభావం ప్రజలు మరింత స్పష్టంగా చూడడానికి సహాయపడుతుంది.
Advertisement

Next Story

Most Viewed