MOTHER LANGUAGE : ఇంట్లో మాతృ భాషలో మాట్లాడితే ఎన్ని లాభాలున్నాయో తెలుసా?

by Sujitha Rachapalli |
MOTHER LANGUAGE : ఇంట్లో మాతృ భాషలో మాట్లాడితే ఎన్ని లాభాలున్నాయో తెలుసా?
X

దిశ, ఫీచర్స్ : ఇంట్లో మాతృభాషలో మాట్లాడటం వల్ల అనేక లాభాలున్నాయని చెప్తున్నారు నిపుణులు. కేవలం కమ్యూనికేషన్ మాత్రమే కాదు సంస్కృతిని సంరక్షించడం, వ్యక్తిగత అభివృద్ధి, అభిజ్ఞా సామర్థ్యం పెరుగుదలలో కీలకపాత్ర పోషిస్తుంది. వీటితోపాటు అనేక ప్రయోజనాలు ఉండగా.. అవేంటో వివరిస్తున్నారు.

సంస్కృతి పరిరక్షణ

ఇంట్లో మదర్ లాంగ్వేజ్ యూజ్ చేయడం వల్ల సాంస్కృతిక వారసత్వం, సంప్రదాయాలను పరిరక్షించడంలో సహాయపడుతుంది. అవి తరతరాలుగా అందించబడుతున్నాయని తెలుస్తుంది.

కుటుంబ బంధాలు

మాతృ భాషలో మాట్లాడటం కుటుంబ సభ్యుల మధ్య బలమైన సంబంధాలను పెంపొందిస్తుంది. అవగాహనను కలిగిస్తుంది. ఎందుకంటే ఇది భావోద్వేగ మద్దతుతో ముడిపడి ఉంటుంది.

కమ్యూనికేషన్ స్కిల్స్

మాతృభాషపై పట్టు సాధించడం వల్ల ఇతర భాషలను సులభంగా నేర్చుకోవచ్చు. ఆటోమేటిక్ గా కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి.

ఇంటెలిజెన్స్

ఇంట్లో మాతృభాషలో మాట్లాడే పిల్లల్లో మెరుగైన జ్ఞాపక శక్తి, ప్రాబ్లం సాల్వింగ్ స్కిల్స్ అధికంగా ఉన్నాయని పలు అధ్యయనాలు చెప్తున్నాయి. విమర్శనాత్మక ఆలోచనలతో సహా మెరుగైన తెలివి తేటలను కలిగి ఉంటారు.

ఎమోషనల్ వెల్ బీయింగ్

మాతృభాషలో మాట్లాడటం వల్ల సరైన భావ వ్యక్తీకరణ, భావోద్వేగ స్వేచ్ఛ కలిగి ఉంటారు. దీనివల్ల మెంటల్ అండ్ ఎమోషనల్ గా హెల్తీగా ఉంటారని చెప్తున్నారు నిపుణులు.

గుర్తింపు, ఆత్మగౌరవం

మదర్ లాంగ్వేజ్ ఉపయోగించడం వల్ల వ్యక్తులు బలమైన గుర్తింపును పొందడంలో సహాయం చేస్తుంది. ఆత్మగౌరవాన్ని పెంచుతుంది. ఎందుకంటే మాతృ భాష మూలాలు, సంస్కృతిక నేపథ్యంతో వారిని కలుపుతుంది.

మెరుగైన విద్యకు పునాది

మాతృభాషలో బలమైన పునాది చదువులో బాగా రాణించేందుకు ఉపయోగపడుతుంది. అకడమిక్స్ లో మెరుగైన పనితీరుకు దోహదం చేస్తుందని పరిశోధనలు చెప్తున్నాయి. ఎందుకంటే మదర్ లాంగ్వేజ్ ఇతర సబ్జెక్ట్స్ నేర్చుకోవడానికి పునాది వేస్తుంది.

బహుభాషా ప్రయోజనాలు

మాతృభాషతో సహా ఇతర భాషల వాతావరణంలో పెరగడం.. మదర్ లాంగ్వేజ్ తో పాటు మల్టీ లాంగ్వేజెస్ నేర్చుకునేందుకు సహాయపడుతుంది. మల్టీ టాస్కింగ్ స్కిల్స్ పెంపొందుతాయి.

Advertisement

Next Story

Most Viewed