శృంగారం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు.. మీరు అస్సలు ఊహించనివి...

by Sujitha Rachapalli |
శృంగారం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు.. మీరు అస్సలు ఊహించనివి...
X

దిశ, ఫీచర్స్ : సెక్స్ అనేది ఆనందం, సాన్నిహిత్యం మాత్రమే కాదు. కొన్ని ఆశ్చర్యకరమైన ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగి ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంచడం నుంచి నిద్రను మెరుగుపరచడం వరకు.. ఒత్తిడి తగ్గించడం నుంచి గుండెను పదిలంగా ఉంచడం వరకు... ఆరోగ్యకరమైన లైంగిక జీవితాన్ని కలిగి ఉండటం వల్ల కలిగే బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాం.

ఒత్తిడి తగ్గుదల

ఒత్తిడికి గురైనప్పుడు.. శరీరం కార్టిసాల్ అనే హార్మోన్‌ను విడుదల చేస్తుంది. ఇది ఎక్కువ మొత్తంలో రిలీజ్ అయితే ఉద్రిక్తత లాంటి అనుభూతిని కలిగిస్తుంది. అయితే సెక్స్ ఎండార్ఫిన్‌ల విడుదలను ప్రేరేపిస్తుంది. ఇవి మంచి అనుభూతిని కలిగించే హార్మోన్లు. కాగా మానసిక స్థితిని పెంచుతాయి. అంతేకాదు శృంగారం లవ్ హార్మోన్ అని పిలువబడే ఆక్సిటోసిన్ విడుదలను ప్రేరేపిస్తుంది. ఇది రిలాక్స్‌గా చేస్తుంది. భాగస్వామితో మరింత కనెక్ట్ అవ్వడానికి సహాయపడుతుంది. ఒత్తిడి స్థాయిలను పూర్తిగా తగ్గిస్తుంది.

నిద్రపోయేందుకు సహాయం

సెక్స్ సమయంలో శరీరం విడుదల చేసే హార్మోన్ల జాబితాలో ప్రోలాక్టిన్ ఉంటుంది. నిద్రను నియంత్రించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. కాగా సెక్స్ తర్వాత.. ప్రొలాక్టిన్‌లో పెరుగుదల ఎక్కువగా మగత, రిలాక్స్డ్ అనుభూతికి కారణమవుతుంది. ఇది మరింత సులభంగా నిద్రపోవడానికి సహాయపడటమే కాకుండా... లోతైన, ప్రశాంతమైన నిద్రకు మద్దతు ఇస్తుంది.

రోగనిరోధక శక్తి మెరుగు

హ్యూమన్ పాపిల్లోమావైరస్ (HPV)తో సహా అనేక ఇన్ఫెక్షన్ల నుంచి రక్షించే యాంటీబాడీస్ ఉత్పత్తిని పెంచడం ద్వారా సెక్స్.. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ప్రతి వారం మూడు లేదా అంతకంటే ఎక్కువ సార్లు శృంగారం చేసే వ్యక్తులు లాలాజలంలో యాంటీబాడీ ఇమ్యునోగ్లోబులిన్ Aని కలిగి ఉంటారు. ఇది వైరస్లు, బ్యాక్టీరియాతో పోరాడే శరీర సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇక 2021లో జరిపిన అధ్యయనం సెక్స్‌లో పాల్గొనడం కొవిడ్-19 వైరస్‌తో పోరాడే మెరుగైన సామర్థ్యంతో ముడిపడి ఉందని కనుగొంది. సెక్స్ అనేది మంచి నిద్రతో ముడిపడి ఉండగా.. ప్రతి రాత్రి తగినంత నాణ్యమైన నిద్రను పొందడం రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది.

సహజ నొప్పి నివారిణి

ఒత్తిడిని నిర్వహించడంలో సహాయపడే ఫీల్ గుడ్ హార్మోన్లు.. సహజ నొప్పి నివారిణిగా కూడా పనిచేస్తాయి. సెక్స్ సమయంలో శరీరం ఎండార్ఫిన్‌లతో నిండిపోతుంది. ఇది మెదడులోని నొప్పి గ్రాహకాలతో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు పెయిన్ సిగ్నల్స్ ను బ్లాక్ చేస్తుంది. మైగ్రేన్ అటాక్‌లు లేదా క్లస్టర్ తలనొప్పి వచ్చే వ్యక్తులకు.. సెక్స్ హెల్ప్ చేస్తుందని, ఈ లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుందని 2013లో యూనివర్శిటీ ఆఫ్ మున్‌స్టర్ నిర్వహించిన సర్వేలో గుర్తించబడింది.

పీరియడ్ పెయిన్ రిలీవర్

రుతుక్రమం నొప్పిని తగ్గించేందుకు శృంగారం సహాయం చేస్తుంది. గర్భాశయం దాని లైనింగ్ షెడ్ చేయడానికి సంకోచించినప్పుడు నొప్పి ఏర్పడుతుంది. అయితే సెక్స్ సమయంలో కలిగే ఉద్వేగం గర్భాశయ కండరంలో సంకోచాలకు కారణమవుతుంది. ఒత్తిడిని తగ్గించడం ద్వారా పెయిన్ రిలీఫ్ ఇస్తుంది. ఒకవేళ పీరియడ్ టైంలో సెక్స్‌లో కంఫర్ట్ గా లేకుంటే.. హస్త ప్రయోగం వల్ల కూడా అదే ప్రయోజనాలు ఉంటాయని చెప్తున్నారు నిపుణులు.

గుండె ఆరోగ్యం

సెక్స్ హృదయానికి కొన్ని విభిన్న మార్గాల్లో మంచిది. కాగా ఇది హృదయ స్పందన రేటును పెంచుతుంది. సరైన రక్త ప్రసరణకు హెల్ప్ చేస్తూ.. రక్తపోటును ఆరోగ్యకరమైన పరిధిలో ఉంచడంలో సహాయపడుతుంది. కొన్ని పరిశోధనలు యువకులకు, ఆరోగ్యవంతమైన పురుషులకు.. క్రమం తప్పకుండా సెక్స్ చేయడం వల్ల గుండె సమస్య వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుందని సూచిస్తున్నాయి. ఇక మహిళలకు... వారు ఎంత తరచుగా సెక్స్ చేశారనే దానికంటే వారి లైంగిక అనుభవాల నాణ్యత గుండె సమస్యల ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయం చేస్తుందని మరో అధ్యయనం చూపించింది. కాగా కనీసం వారానికి ఒకసారి సెక్స్ చేసే గుండెపోటు రోగులు గుండె జబ్బుతో మరణించే అవకాశం 10 శాతం తక్కువగా ఉంటుందని 2020 అధ్యయనం చెప్తుంది.

ప్రోస్టేట్ క్యాన్సర్‌ను నిరోధించవచ్చు

తరచుగా సెక్స్ చేసే పురుషులకు ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశం తక్కువగా ఉంటుందని సూచించడానికి పెరుగుతున్న ఆధారాలు ఉన్నాయి. ఈ సమయంలో శరీరం మీ ప్రోస్టేట్ నుంచి ద్రవం, కణాలను బయటకు పంపుతుంది, ఇది క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచే సంభావ్య టాక్సిన్స్ లేదా హానికరమైన పదార్థాలను తొలగించడంలో సహాయపడుతుంది. కాగా 2016లో జరిపిన ఒక అధ్యయనం ప్రకారం.. 20 నుంచి 40 ఏళ్లలోపు పురుషులు నెలకు కనీసం 21 సార్లు సెక్స్ చేసేవారిలో ప్రోస్టేట్ క్యాన్సర్ అవకాశాలు 20 శాతం వరకు తగ్గాయి.

Read More : AI Sex: బ్రోతల్ VS సైబ్రోతల్.. వ్యభిచార గృహాల్లో సెక్స్ వర్కర్లుగా AI రోబోలు

Next Story

Most Viewed