- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Beautiful Beach: ఆ బీచ్‌లో ఎటు చూసినా ఎర్రపీతలే..!
దిశ, ఫీచర్స్: బీచ్ అంటే చాలామందికి ఇష్టం. వీటిలో కొన్ని అందంగా ఉండి ప్రత్యేకంగా కనిపిస్తుంటాయి. అటువంటి వాటిలో ఒకటి ఎర్ర పీతల బీచ్. ఇక్కడ సూర్యాస్తమయాలు చూడాలంటే రెండు కళ్లు సరిపోవు. ఇది మాత్రమే కాదు ఇక్కడ కొన్ని వందల పీతలు ఉంటాయి. ఇవి నడుచుకుంటూ వెళ్తుంటే చూసేందుకు అందంగా కనిపిస్తుంటాయి. చాలామంది ఈ దృశ్యాన్ని వాళ్ల కెమెరాలతో క్లిక్‌మనిపిస్తుంటారు. ఈ బీచ్ ఎక్కడో కాదు మన భారతదేశంలోనే ఉంది.
ఒడిశాలోని బాలసూర్ పట్టణానికి 34 కిలోమీటర్ల దూరంలో దిగ్దా అని పిలిచే గ్రామంలో ఈ బీచ్ ఉంది. అందంగా నడుచుకుంటూ వెళ్తున్న పీతలను చూడడానికి పర్యాటకులు అధిక సంఖ్యలో ఇక్కడికి వస్తుంటారు. ఇసుక తిన్నెలపై ఎరుపు రంగులో చీమల్లా కదులుతుంటాయి. వీటిపై సూర్యకాంతి పడితే, అవి ప్రకాశవంతంగా వెలుగుతూ కనిపిస్తాయి. ఏడాది పొడుగునా ఇవి బీచ్‌లో తిరుగుతూనే ఉంటాయి. అక్కడి గ్రామస్తులు ఈ పీతలను రక్షించేందుకు ప్రయత్నిస్తుంటారు.
ఈ ఎర్ర పీతలు అక్కడ ఉన్న పోషకాలను సైక్లింగ్ చేస్తూ.. పర్యావరణ వ్యవస్థలో కలిసిపోతాయి. ఇవి తీర ప్రాంతంలోని మొక్కల అవశేషాలు సేంద్రియ పదార్ధాలను తిని జీవిస్తుంటాయి. దీని వల్ల ఆ ప్రాంతమంతా క్లిన్‌గా కనిపిస్తుంది. ఈ పీతలను చూసేందుకు ప్రకృతి ప్రేమికులు, ఫోటోగ్రాఫర్లు అధిక సంఖ్యలో ఇక్కడికి వస్తుంటారు. సాయంత్రం వేళ ఈ సముద్ర ప్రాంతానికి వెళితే, అక్కడ కొన్ని వందల పీతలు తీరంలో నడుకుంటూ వెళ్తుంటాయి. అలా అవి వెళ్తుంటే.. సముద్ర తీరానికి ఎర్ర తివాచీని పరిచినట్లుగా అందంగా కనిపిస్తుంటుంది. ప్రభుత్వం కూడా ఈ ఎర్రపీతలను కాపాడుకుంటూ వస్తున్నది.