- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హాట్ వాటర్ తాగేవారికి బ్యాడ్ న్యూస్.. నిపుణులు ఏం చెబుతున్నారంటే..?
దిశ, ఫీచర్స్: మన శరీరంలో దాదాపు 70% నీరు ఉంటుంది. ఇది శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది. అంతే కాకుండా , మీ అంతర్గత అవయవాలు కూడా రిఫ్రెష్ అవుతాయి. అందుకే ఆరోగ్య సమస్యలు ఉన్నవారు రోజూ ఏడెనిమిది గ్లాసుల నీరు తాగాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రతిరోజూ నీరు త్రాగడం వల్ల మీ శరీరానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కానీ ఈ రోజుల్లో, చాలా మంది సాధారణ నీటికి బదులుగా చాలా వేడి నీటిని ఉపయోగిస్తున్నారు. వేడి నీళ్లను తీసుకోవడం వల్ల రకరకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు అంటున్నారు. మీరు వేడి నీటిని ఎక్కువగా తాగితే మీ శరీరంపై ఎలాంటి దుష్ప్రభావాలూ కలుగుతాయో ఇక్కడ చూద్దాం.
ప్రతిరోజూ వేడి నీటిని తాగడం వల్ల శరీరంలోని నీరు బయటకు పోయినప్పటికీ కిడ్నీలపై మరింత ఒత్తిడి పడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అయితే ఇప్పటికే కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న వారు ఈ నీటిని తాగవద్దని నిపుణులు సూచిస్తున్నారు.
వేడినీరు ఎక్కువగా తాగడం వల్ల మెదడుపై కూడా తీవ్ర ప్రభావం ఉంటుంది. దీంతో పాటు రక్తప్రసరణ వ్యవస్థ కూడా దెబ్బతినే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీంతో పాటు కొంతమందిలో పొట్ట ఉబ్బరం వంటి సమస్యలు కూడా రావచ్చు. కాబట్టి ఇప్పటికే పొట్ట సమస్యలతో బాధపడేవారు ఈ నీటిని తాగక పోవడం చాలా మంచిది.