Bad Habits: ఈ చెడు అలవాట్లు ఉంటే మీ జీవితం నాశనమవ్వడం ఖాయం?

by Prasanna |   ( Updated:2023-03-18 07:55:57.0  )
Bad Habits: ఈ చెడు అలవాట్లు ఉంటే మీ జీవితం నాశనమవ్వడం ఖాయం?
X

దిశ, వెబ్ డెస్క్ : మనం ఒక పనిని క్రమం తప్పకుండా చేయాలంటే కొన్నింటిని పాటించాలి. అవి పాటించాలంటే చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి. మన నిత్య జీవితంలో కొన్ని అలవాట్లు జీవితం నాశనం అయ్యేలా ఉన్నాయి. అవేంటో ఇక్కడ చూద్దాం.

1. ప్రస్తుత రోజుల్లో తిండి తినకుండా అయిన ఉంటారేమో కానీ చేతిలో మొబైల్ ఫోన్ లేకుండా మాత్రం క్షణం కూడా ఉండలేకపోతున్నారు. ఫోను కూడా మన బాడీలో ఒక పార్ట్ లాగా అయిపోయింది. మన ఎదురుగా ఉన్న వారిని వదిలేసి ఎక్కడో ఉన్న వారికీ వాట్సాప్లో మెసేజ్ చేస్తున్నాం. దీనిని మంచికి ఉపయోగిస్తున్నామా ? లేక చెడుకు ఉపయోగిస్తున్నామా ? అన్నది తెలుసుకుంటే చాలు. ఫోనును అవసరానికి వాడండి.. అవసరానికి మించి వాడకూడదని గుర్తు పెట్టుకోండి.

2. మంచి ఆరోగ్య కరమైన ఆహారాన్ని తీసుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటాము. అదే అనారోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటే నీరసంగా అనిపిస్తుంటుంది. అందరూ బయట ఫుడ్స్‌కు బాగా అలవాటు పడిపోయారు. ఫ్రైడ్ రైస్ , చికెన్ బిర్యానీ, కూల్ డ్రింక్స్ ఇలాంటివి తినడం , తాగడం ఒక పనిలాగా అయిపోయింది. ఇలాంటి ఫుడ్స్‌ను దూరం పెడితే ఆరోగ్యంగా ఉండగలుగుతాము.

3.మనం బ్రతకాలంటే ఆహారం ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే అవసరం. మనం బాగా అలిసి పోయినప్పుడు నిద్ర మనకి తిరిగి శక్తినిస్తుంది. మనము మంచిగా నిద్ర పోయినప్పుడే ఆరోగ్యంగా ఉన్నట్టు. కానీ నేటి యువత అర్ధ రాత్రి వరకు మొబైల్ ఫోన్స్ వాడుతూ తన జీవితాన్ని తానే నాశనం చేసుకుంటున్నాడు.

Also Read..

Bad Habits: ఈ చెడు అలవాట్లు ఉంటే మీ జీవితం నాశనమవ్వడం ఖాయం?

Advertisement

Next Story