- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Bad Cholesterol Effect: రాత్రిపూట మీకలా అనిపిస్తోందా..? డేంజర్‌లో పడకముందే ఇలా చేయండి !
దిశ, ఫీచర్స్ : రాత్రిపూట సరిగ్గా నిద్రపోపోయే సమయానికి మనసులో ఆందోళన మొదలవుతుంది. చేతులు, కాళ్లల్లో జలదరింపు అనుభవిస్తారు. అరికాళ్లల్లో మంట పుడుతుంది. అప్పుడప్పుడూ అయితే ఓకే కానీ.. దీర్ఘకాలంపాటు ఇలా జరుగుతున్నా నిర్లక్ష్యం చేస్తే మాత్రం ప్రాణాల మీదకే రావచ్చు. ఎందుకంటే శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరగడంవల్ల, అది ఫలకాలుగా మారి రక్త సిరల్లో అడ్డంకిగా మారడంవల్ల ఈ సమస్య తలెత్తుతుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.
ఎప్పుడైతే రక్త సిరల్లో చెడు కొలెస్ట్రాల్ ఫలకాలు అడ్డంకిగా మారుతాయో అప్పుడు స్ట్రోక్, గుండె జబ్బుల వంటి ప్రాణాంతక పరిస్థితికి దారితీస్తుందని వైద్య నిపుణులు చెప్తున్నారు. కాబట్టి నియంత్రించుకోవడం చాలా ముఖ్యం. నిజానికి చెడు కొవ్వు అనేది కణ త్వచాలలో కనిపించే జిడ్డుగల స్టెరాయిడ్. రక్త సిరల్లో ఫలకాలుగా పేరుకుపోయి శరీరానికి, గుండెకు రక్త సరఫరాలో ఆటంకంగా మారుతుంది. దీంతో అధిక రక్తపోటు, బ్రెయిన్ స్ట్రోక్, గుండెపోటు వంటివి సంభవించే అవకాశం ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. ఇక కొలెస్ట్రాల్‌లో అధిక సాంద్రత కలిగిన లిపోప్రోటీన్(హెచ్‌డీఎల్)ను మంచి కొలెస్ట్రాల్‌గా, అలాగే తక్కువ సాంద్రత కలిగిన లిపో ప్రోటీన్(ఎల్‌డీఎల్)ను చెడు కొలెస్ట్రాల్‌గా వైద్య నిపుణులు పరిగణిస్తారు.
తక్కువ సాంద్రత కలిగిన లిపో ప్రోటీన్.. అంటే చెడు కొలెస్ట్రాల్ శరీరంలో పెరిగినప్పుడు రాత్రిపూట పాదాలలో మంట, చెమటలు పడుతూ శరీరం చల్లగా మారడం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. దీంతోపాటు నిద్రపోతున్నప్పుడు ఛాతీపై ఒత్తిడి పెరగడం, నొప్పిగా అనిపించడం, ఒక్కోసారి ఊపిరి ఆడకపోవడం వంటివి జరగవచ్చు. కాళ్లు, చేతుల్లో జలదరింపు కూడా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగిందనడానికి సంకేతమే. కాబట్టి ఈ లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది.
*నోట్: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దీనిని ‘దిశ’ ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.