- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పుట్టబోయే బిడ్డ అవయవాలు ప్లాస్టిక్‌తో నిండిపోతే..
దిశ, ఫీచర్స్ : ప్లాస్టిక్ కాలుష్యం పర్యావరణానికి ముప్పుగా పరిణమించింది. గ్రహం, మనుషుల ఆరోగ్యంపై ప్రభావం ఆందోళనలను రేకెత్తిస్తుంది. ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిన మహాసముద్రాలు, ఆహారంలోకి చొరబడిన మైక్రో ప్లాస్టిక్స్, శ్వాస తీసుకుంటే బ్రెయిన్ లోకి వెళ్తున్న ప్లాస్టిక్ కణాలు.. రక్తం, గుండె చివరకు జననేంద్రియాల్లోనూ కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో శాస్త్రవేత్తలు, ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్లాస్టిక్ వినియోగం నుంచి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.
కాగా తాజా అధ్యయనం మరో బాంబు పేల్చింది. గర్భంలో ఉన్న బిడ్డకు తల్లి నుంచి ప్లాస్టిక్స్ చేరే అవకాశం ఉందని తెలిపింది. పాలిమైడ్ 12 అని పిలువబడే చిన్న ప్లాస్టిక్ కణాలు.. నవజాత శిశువుల గుండె, మెదడు, కాలేయం, ఊపిరితిత్తులు, మూత్రపిండాల్లోకి చేరుతాయని తెలిపింది. ఈ పరిశోధన గర్భధారణ సమయంలో పిండం అభివృద్ధిపై భయాన్ని.. తీసుకోవాల్సిన జాగ్రత్తలను హైలెట్ చేస్తుంది.
సైన్స్ ఆఫ్ ది టోటల్ ఎన్విరాన్మెంట్ జర్నల్ లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. ఈ ప్లాస్టిక్ కణాలు ప్లాసెంటల్ అవరోధాన్ని దాటుకుని, అభివృద్ధి చెందుతున్న పిండాన్ని హానికరమైన కాలుష్య కారకాలకు గురిచేస్తాయి. రట్జర్స్ హెల్త్ పరిశోధకులు చేసిన ప్రయోగంలో ఎలుకలను వారం రోజులపాటు ప్లాస్టిక్ కణాలకు బహిర్గతం చేశారు. తల్లి, పిండం మధ్య రక్త ప్రసరణలో కూడా వీటిని గుర్తించారు. బిడ్డ పుట్టిన రెండు వారాల తర్వాత పరిశీలించగా.. తల్లి మెదడు, మూత్రపిండాలు, గుండె, కాలేయంలో ఉన్న అవే ప్లాస్టిక్స్ నవజాత శిశువుల అవయవాల్లో గుర్తించారు. ఇవి బేబీ ఎదుగుదలపై భారీ ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని తెలిపారు. కాగా ప్లాస్టిక్ పొల్యూషన్ దీర్ఘకాలిక ఆరోగ్య ప్రభావంపై తీవ్ర ఆందోళనలను పెంచుతుంది.