సాధారణ ఉప్పుకంటే సైంధవ లవణం ఆరోగ్యానికి మంచిదా?.. నిపుణులు ఏం చెప్తున్నారంటే..

by Dishafeatures2 |
సాధారణ ఉప్పుకంటే సైంధవ లవణం ఆరోగ్యానికి మంచిదా?.. నిపుణులు ఏం చెప్తున్నారంటే..
X

దిశ, ఫీచర్స్ : ఎంత బాగా వండినప్పటికీ కూరల్లో ఉప్పు లేనిదే రుచి రాదు. ప్రస్తుతం ఎక్కువ మంది తెల్లగా కనిపించే ప్రాసెసింగ్ చేసిన సాల్టునే వాడుతుంటారు. దీనిని పరిమిత స్థాయిలో వాడితే ఆరోగ్యానికి మంచిది. అధికంగా వాడితేనే ప్రమాదకరం. అయితే దీనికి ప్రత్యామ్నాయంగా ఎర్రగా, వివిధ రంగుల్లో ఉండే రాక్‌సాల్ట్ లేదా సైంధవ లవణాన్ని వాడితే ఆరోగ్యానికి చాలా మంచిదని ఆయుర్వేద నిపుణులు చెప్తుంటారు. వాస్తవానికి సైంధవ లవణం అనేది ఉప్పు కాదు. ఇది మెగ్నేషియం, సల్ఫేట్‌లతో సహజంగా తయారయ్యే, ఎటువంటి కెమికల్స్‌లేని ఉప్పుగా పేర్కొంటారు. డార్క్ బ్లూ, వయోలెట్, పింక్, ఆరెంజ్, రెడ్, ఎల్లో, గ్రే కలర్లలో కూడా లభిస్తుంది. దీనిని వాడటంవల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయో చూద్దాం.

ఆయుర్వేద నిపుణుల ప్రకారం.. సైంధవ ఉప్పు ఎసిడిటీ, వికారం, మలబద్ధకం సమస్యలను దూరం చేస్తుంది. శరీరంలో కొలెస్ట్రాల్ లెవల్స్ పెరగకుండా అరికడుతుంది. డయాబెటిస్ బాధితుల్లో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. హిమాలయన్ క్రిస్టల్‌గా పిలిచే ఈ సైంధవ ఉప్పును మజ్జిగలో కలిపి తాగితే అజీర్తి, మలబద్ధకం తగ్గుతాయి. ఐరన్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది కాబట్టి రక్తహీనత సమస్యకు చెక్ పెడుతుంది. రోగ నిరోధకశక్తిని పెంచడం ద్వారా వివిధ ఇన్ఫెక్షన్ల బారినుంచి కాపాడుతుంది. థైరాయి, గొంతు నొప్పి, గొంతులో మంట వంటి ప్రాబ్లమ్స్‌ను దూరం చేస్తుందని నిపుణులు చెప్తున్నారు. అయితే ఇది సాధారణ ఉప్పుకంటే ఖరీదు కూడా ఎక్కువగా ఉంటుందట. ఆయుర్వేదిక్ నిపుణుల ప్రకారం సైంధవ లవణం ఆరోగ్యానికి మంచిదే అయినా, దానిని రుజువు చేసే ఇటీవలి సైంటిఫిక్ ఆధారాలు, పరిశోధనలు అయితే లేవు. అందుకే వాడేముందు నిపుణులను సంప్రదించడం బెటర్.

Next Story

Most Viewed