నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

by S Gopi |
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఈక్విటీ మార్కెట్లు భారీ లాభాలను సాధించిన ఒకరోజు తర్వాత మళ్లీ నష్టాలను చూశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల మద్దతు లభించినప్పటికీ గరిష్ఠాల వద్ద మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడం, కీలక రంగాల్లో అమ్మకాల ఒత్తిడి కారణంగా సూచీలు బలహీనపడ్డాయి. ఇవికాకుండా త్రైమాసిక ఫలితాలు మెరుగ్గా ఉన్నాయి. అయితే, కీలక ఐటీ రంగం నుంచి సరైన వృద్ధి లేక సూచీలపై ఒత్తిడి కనిపిస్తోందని విశ్లేషకులు తెలిపారు. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 188.50 పాయింట్లు నష్టపోయి 74,482 వద్ద, నిఫ్టీ 38.55 పాయింట్ల నష్టంతో 22,604 వద్ద ఉంది. నిఫ్టీలో ఆటో, రియల్టీ, ఫైనాన్స్ రంగాలు రాణించాయి. కీలక ఐటీ, మెటల్, మీడియా రంగాలు బలహీనపడ్డాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఎంఅండ్ఎం, పవర్‌గ్రిడ్, ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, మారుతీ సుజుకి కంపెనీల షేర్లు లాభాలను దక్కించుకున్నాయి. టెక్ మహీంద్రా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, హెచ్‌సీఎల్ టెక్, సన్‌ఫార్మా, టీసీఎస్ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 83.43 వద్ద ఉంది.

Advertisement

Next Story

Most Viewed