ఫైనల్లీ ఆయన ఆశీస్సులు పొందే అదృష్టం కలిగింది.. ఎమోషనల్ ట్వీట్ పెట్టిన మహేష్ బాబు హీరోయిన్

by Hamsa |
ఫైనల్లీ ఆయన ఆశీస్సులు పొందే అదృష్టం కలిగింది.. ఎమోషనల్ ట్వీట్ పెట్టిన మహేష్ బాబు హీరోయిన్
X

దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ ప్రీతి జింటా(Preity Zinta) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు పలు హిందీ చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇక తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) సరసన ‘రాజకుమారుడు’ సినిమాలో నటించింది. అయితే ఈ మూవీతోనే ఇండస్ట్రీకి వచ్చిన ఈ భామ అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోలు వెంకటేష్(Venkatesh), సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్, అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan), అక్షయ్ కుమార్ వంటి వారితో నటించి ఫేమ్ సంపాదించుకుంది. ఇక గత కొద్ది కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఈ అమ్మడు ‘లాహోర్’తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఈ నేపథ్యంలో.. తాజాగా, ప్రీతి జింటా ట్విట్టర్ ద్వారా ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. పలుసార్లు వాయిదా పడిన పని ఫైనల్లీ సక్సెస్ అయినట్లు తెలుపుతూ ఓ వీడియోను షేర్ చేసింది. ‘‘నేను గత కొన్నేళ్లుగా గోల్డెన్ టెంపుల్‌కి వెళ్లాలని చాలాసార్లు ప్రయత్నించాను. కానీ ప్రతిసారీ ఏదో ఒక సంఘటన జరిగినప్పుడు ప్లాన్ క్యాన్సిల్ అయింది. ఈసారి భిన్నంగా జరిగింది. బాబా నన్ను పిలిపించారు. అన్ని దారులు తెరిచారు. రామ నవమి రోజున స్వర్ణ దేవాలయంలో ఆయన ఆశీస్సులు పొందే అదృష్టం కలిగింది. నేను చాలా ప్రయాణం చేసిన తర్వాత అలసిపోయాను.

నిద్ర , జెట్ లాగ్ లేదు, కానీ నేను ఆలయంలోకి ప్రవేశించిన క్షణంలో ప్రతిదీ క్షీణించింది. లోతైన కృతజ్ఞతా భావం. చెందిన అనుభూతి నన్ను ఆవరించింది. హాజరైన ప్రతి ఒక్కరి సామూహిక శక్తి. విశ్వాసం మాయాజాలం, నేను లొంగిపోయినప్పుడు నా హృదయం తెరుచుకుంది. ప్రపంచం మసకబారింది.. ప్రాంగణాన్ని శుభ్రంగా ఉంచినందుకు. రుచికరమైన కడ ప్రసాదం కోసం ఆలయ నిర్వాహకులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అద్భుతమైన చిరునవ్వులు, శుభాకాంక్షలతో నన్ను పలకరించినందుకు ఓపికగా క్యూలో వేచి ఉన్న వారందరికీ దిల్ సే ధన్యవాదాలు’’ అని రాసుకొచ్చింది. అలాగే ఆమె దేవాలయాన్ని సందర్శించిన వీడియోను కూడా షేర్ చేసింది.



Next Story

Most Viewed