- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆకులే కదా అని నిర్లక్ష్యం వద్దు.. మీ ఆరోగ్యానికి ఔషధంలా పనిచేస్తాయి !
దిశ, ఫీచర్స్: ఆధునిక కాలంలో ఉన్నాం కాబట్టి ఆకులు, అలముల గురించి చాలామందికి తెలియకపోవచ్చు. కానీ ఆకులే కదా అని నిర్లక్ష్యం చేస్తే మనం నష్టపోయే అవకాశం కూడా ఉందని పెద్దలు, ఆయుర్వేదిక్ నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే మన కళ్ల ముందు కనిపించే పలు రకాల మొక్కలు, వాటి ఆకులు కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుస్తాయి. ముఖ్యంగా అరటి ఆకులు, తమల పాకుల గురించి తెలియనివారు ఉండరు. కొందరు ఇప్పటికీ అరటి ఆకుల్లో భోజనం చేస్తుంటారు. వాటిలో ఉండే ఔషధ గుణాలు తినే ఆహారంలోని విషపదార్థాలను తొలగిస్తాయంటారు పెద్దలు చెప్తుంటారు. అరటి ఆకుల్లో స్నానం చేస్తే కలిగే ప్రయోజనాలు చాలానే ఉన్నాయి. అవేంటో చూద్దాం.
అరటి ఆకులతో స్నానం
అరటి ఆకుల స్నానం హెల్త్‌కు చాలా మంచిది. పైగా నీళ్లు కూడా ఎక్కువగా అవసరం లేదు. సూర్యుడు ఉదయించే సమయానికి నడుము కింది భాగంలో ఓ చిన్న టవల్ కట్టుకొని, తలపై తడిగా ఉండే టవల్ చుట్టుకోవాలి. ఆ తర్వాత అరటి ఆకులను శరీరానికి చుట్టుకోవాలి. జస్ట్ మొహం వద్ద శ్వాస తీసుకోవడానికి మాత్రమే స్పేస్ ఉండేలా చూసుకోవాలి. ఆ తర్వాత ఒక ఈత లేదా తాటి ఆకులతో తయారు చేసిన చాప మీద పడుకోవాలి. ఆ సమయంలో సూర్యుడి కిరణాలు ఒంటిపై పడేలా అరగంట సేపు అలాగే ఉంంటూ.. తడి ఆరుతున్న కొద్దీ ఆకులపై నీళ్లు చల్లుతూ ఉండాలి. ఇలా చేస్తున్న సందర్భంలో చెమట కూడా వస్తుంది. ఎవరికైనా ఇబ్బందిగా అనిపిస్తే మధ్యలోనే ఆపి వేయవచ్చు కూడా.
రుగ్మతలు దూరం
మానసిక, శారీరక రుగ్మతలను దూరం చేయడంలో అరటి ఆకులతో స్నానం ప్రయోజనకరంగా ఉంటుంది. అనేక రుగ్మతలు తగ్గిపోతాయి. శ్వాసకోశ ఇబ్బందులు, అలెర్జీలు, కాళ్లు, చేతుల్లో వివిధ కారణాలతో వచ్చే వాపు వంటి ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి. కిడ్నీ సమస్యలు, కండరాలు, నరాలకు సంబంధించిన రుగ్మతలు తగ్గుతాయి. అధిక బరువు కూడా తగ్గుతారు. శరీరం, ముఖం అందంగా మారుతుంది. అరటి ఆకులు విషపూరితమైన గాలిని పీల్చుకుంటాయి. కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడుతాయి. అయితే వీటితో స్నానం చేస్తున్న వేళ శరీరంలోని నీరు చెమట రూపంలో ఎక్కువగా బయటకు పోతుంది. కాబట్టి డీ హైడ్రేషన్‌కు గురికాకుండా చూసుకోవాలి. అందుకోసం ముందుగానే నీళ్లు ఎక్కువగా తాగి, తలస్నానం చేసి మొదలు పెట్టాలి. మొదటి రోజు పచ్చి కూరగాయలు, పండ్లు, కీర, దోసకాయ వంటివి తినడం, జ్యూస్ రూపంలో తీసుకోవడం బెటర్. నాన్ వెజ్, టీ, కాఫీ, కూల్ డ్రింక్స్ కు దూరంగా ఉండాలి. ఇలా చేయడంవల్ల శరీరంలోని విషపదార్థాలు బయటకు పోతాయని, ఎక్కువకాలం జీవించే అవకాశం పెరుగుతుందని ఆయుర్వేదిక్ నిపుణులు చెప్తున్నారు.
తలమపాకులతో బెనిఫిట్స్ ఇవే..
తమల పాకుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ ఫంక్షన్ జరిగినా వీటిని ఉపయోగిస్తుంటారు. సాధారణ సమయంలోనూ వృద్ధులు, మహిళలు వీటిని తినడం చూస్తుంటాం. ఔషధాల తయారీలోనూ ఉపయోగిస్తారు. చాలామంది రాత్రి భోజనం తర్వాత తమలపాకులో వక్క వేసి నములుతారు. దీనివల్ల జీర్ణక్రియ మెరుగు పడుతుంది.
తమలపాకుపై కాసింత పసుపురాసి చిన్న పిల్లల తలపై భాగం(మాడ)లో పట్టిస్తే జలుబు త్వరగా తగ్గిపోతుంది. ఇక వీటితోపాటు తులసి ఆకులు, లవంగాలు, పచ్చకర్పూరం కలిపి రోజుకు రెండు పూటలా తీసుకుంటే పెద్దలకు , పిల్లలకు దగ్గు, కఫం, గొంతు నొప్పి తగ్గుతాయి. జుట్టు రాలడం, చుండ్రు వంటి సమస్యలు పోవాలంటే తమలపాకులను కొబ్బరినూనెలో వేసి కాసేపు మరిగించి చల్లారిన తర్వాత ఆ నూనెను పెట్టుకోవాలి. పిల్లలకు గాయాలు అయినప్పుడు అందుబాటులో వైద్యులు లేకపోతే తమలపాకులను మెత్తగా నూరి, గాయంపై రాస్తే రక్తస్రావం ఆగిపోతుంది. ఇక ఈ ఆకులను ఉప్పుతో కలిపి నమిలి మింగితే కడుపునొప్పి తగ్గుతుంది. అంతేకాకుండా తమలపాకులు చిగుళ్ల ఆరోగ్యానికి, అధిక బరువు తగ్గడానికి కూడా దోహదపడతాయి.