- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇప్పుడు అంతా వదినా మరదళ్ల గాజుల ట్రెండింగ్‌నే.. దీనిపై జ్యోతిష్య నిపుణుల అభిప్రాయం ఏమిటంటే?
దిశ, ఫీచర్స్ : ఒక్కోసారి కొన్ని కొన్ని ఎక్కువగా ట్రెండ్ అవుతుంటాయి. ఒక్క కొడుకు ఉంటే ఇద్దరు లేదా అంత కంటే ఎక్కువ కొడుకులు ఉన్న వారికి గాజులు పెట్టివ్వాలి లాంటి సంప్రదాయాలు వచ్చి పోతుంటాయి. దీంతో ప్రతి ఒక్కరూ వీటిని ఫాలో అవుతారు. ఇలా చేయకపోతే తమ పిల్లలకు కీడు జరుగుతుందని వారు భావిస్తారు. అయితే ప్రస్తుతం వదిన మరదళ్ళ గాజులు, అమ్మమ్మలు మనవరాళ్లకు గాజులు పెట్టివ్వడం, మనుమలకు లడ్డూలు పెట్టి తువ్వాల కప్పాలి అంటూ ఓ వార్త తెగ ప్రచారం అవుతోంది. అంతే కాకుండా చాలా మంది దీనిని పాటిస్తున్నారు కూడా, ఇప్పటికీ చాలా మంది గాజులు పెట్టివ్వడం, లడ్డూలు పెట్టడం లాంటిది చేస్తున్నారు.
అయితే దీనిపై జ్యోతిష్య నిపుణులు ఏమంటున్నారు. నిజంగానే ఇలా చేయాలా? లేకపోతే? ఇది ఓరూమర్‌నా అనేదాని గురించి ఇపపుడు తెలుసుకుందాం . ఈ గాజులు పెట్టివ్వడంపై జ్యోతిష్య నిపుణులు మాట్లాడుతూ.. ఇదంతా ఓ రూమర్, వాళ్లు వాళ్ల వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఇలాంటి రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు. అంతే తప్ప, ఇలా చేయాలి అనే నియమం అయితే ఏమీ లేదు అని చెప్పుకొచ్చారు. అలాగే పూర్వ కాలంలో మహిళలు తమ భర్త క్షేమం కోసం అమ్మవారికి పూజ చేసి ముత్తైదువులకు గాజులు, పసుపు, కుంకుమ ఇచ్చేవారు కానీ ప్రస్తుతం అలాంటివి ఎవరూ పాటించడం లేదు, కానీ వచ్చిన ఇలాంటి ప్రచారాలను మాత్రం నమ్మి, త్వరగా పాటిస్తున్నారు. ఇవి పాటించకపోతే వారికి ఏదో కీడు జరుగుతుందని భావిస్తున్నారు కానీ అలాంటిది ఏమీ లేదని వాటిని నమ్మద్దంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.