ఉగాది.. కొత్తసంవత్సరంలో.. ఈ రాశి జీవితంలో ఎన్ని కొత్తమలుపులో

by samatah |   ( Updated:2023-03-13 02:40:35.0  )
ఉగాది.. కొత్తసంవత్సరంలో.. ఈ రాశి జీవితంలో ఎన్ని కొత్తమలుపులో
X

దిశ, వెబ్‌డెస్క్ : హిందూ పంచాంగం ప్రక్రారం శుభకృత నామ సంవత్సరం మార్చి21న ముగుస్తుంది. ఇక నూతన సంవత్సరం శోభకృత సంవత్సరంతో ప్రారంభం కాబోతుంది. అయితే ఈ ఉగాది నూతన సంవత్సరం వేళ ప్రతి రాశిలో మార్పులు చోటు చేసుకుంటాయి. ఇక ఉగాదికి అందరూ పంచాంగ శ్రవణం వింటారు. తమ రాశికి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది. ఆదాయ వ్యయాల గురించి తెలుసుకుంటారు.కాగా, ఈ శోభకృతనామ సంవత్సరంలో మేష రాశివారికి ఎలా ఉండబోతుంది. కుటుంబం, వృత్తి, ఆరోగ్యజీవితం గురించి తెలుసుకుందాం.

2023-2024 మేష రాశిలో గ్రహ సంచారం అంటే మార్చి 22 నుండి మే 15 వరకు సూర్యుడు 12వ ఇంట్లోకి, 2023 జూలై 18 నుండి ఆగస్టు 17 వరకు 18వ ఇంటికి, 2023 నవంబర్ 17 నుండి డిసెంబర్ 16 వరకు 8వ ఇంటికి, 2023 నుండి 2023 సూర్యునికి సంచారం.

మార్చి నుండి 8 ఏప్రిల్ 2024 వరకు.ఈ సంవత్సరం మేషరాశికి 1వ ఇంట్లో అంటే లగ్నానికి బృహస్పతి సంచారం ఉంటుంది. శని శుభ స్థానంలో ఉన్నాడు.కుజను 2023 మే 9 నుండి జూన్ 29 వరకు అర్ధాశత నందు ఉన్నాడు. 16 నవంబర్ నుండి 20 డిసెంబర్ 2023 వరకు ఎనిమిదవ ఇంటిని ఆక్రమించాడు. రాహువు ఈ సంవత్సరంలో 1వ ఇంటిని మరియు 12వ ఇంటిని ఆక్రమించాడు. డిసెంబర్ 27, 2023 వరకు కేతువు 7వ ఇంట్లో ఉంటాడు.

దీంతో ఈ సంవత్సరం మేష రాశి వారికి సానుకూలంగా ఉండనుంది. ఆర్థికంగా కలిసి వస్తుందికానీ జాగ్రత్తగా వ్యవహారించాలి. అనవసరమైన రిస్క్‌లు తీసుకోకూడదు. పెట్టుబడుల జోలికి వెళ్లకపోవడమే మంచిది. ఉద్యోగవకాశాలు వచ్చే అవకాశం ఉంది. మీ లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి ఇదే మీకు అనుకూలమైన సమయం.వ్యక్తిగత సంబంధాల్లో కొన్ని హెచ్చుతగ్గులు ఉంటాయి. మీ ప్రియమైన వారు మిమ్ముల్ని అపార్దం చేసుకునే అవకావశం ఉంది. ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త అవసరం.ఆరోగ్యం పట్ల శ్రద్ధతీసుకోవడం అవసరం. వివాహాది ప్రయత్నాలు లాభిస్తాయి.విద్యార్ధులకు కలిసి వస్తుంది. పోటీ పరీక్షల్లో విజయం సాధించే అవకాశం ఉంది. ఆదాయం పెరగాలంటే వెంకటేశ్వర స్వామిని పూజించడం మంచిది.

ఇవి కూడా చదవండి : Telugu Panchangam 13 మార్చి : నేడు శుభ, అశుభ సమయాలివే!

Advertisement

Next Story

Most Viewed