- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పల్లీలే కదా అని లైట్ తీసుకుంటున్నారా! వీటిని తింటే ఎన్ని ప్రయోజనాలో తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..
దిశ, ఫీచర్స్: వేరు శనగపప్పు ప్రతి సామాన్యుడు ఇంట్లో ఉండే వస్తువు. దీనిలో మాంసంలో వున్నంత బలం వుంటుంది. మార్కెట్లో చాలా తక్కువ ధరకే ఇవి మనకు అందుబాటులో ఉంటాయి. డ్రై ఫ్రూట్స్‌కు ఏమాత్రం తగ్గకుండా ఈ వేరుశెనగపప్పులు వుంటాయ్. అయితే వీటిని తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో మనం ఇక్కడ తెలుసుకుందాం..
* 100 గ్రాముల వేరుశెనగల్లో 560 క్యాలరీల శక్తి లభిస్తుంది. అందులో 25 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. 45 గ్రాముల కొవ్వు ఉంటుంది. వీటిని ఎండబెట్టి గ్రైండ్ చేస్తే నూనె వస్తుంది. పచ్చిగా గ్రైండ్ చేస్తే పాలు వస్తాయి. వేపిన తరువాత గ్రైండ్ చేస్తే బటర్ వస్తుంది.
* మేక మాంసం లో కన్నా పల్లీల్లో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది. 100 గ్రాముల మేక మాంసంలో 21 గ్రాముల ప్రోటీన్ వుంటే ఈ 100 గ్రాముల పల్లీల్లో 25 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది.
* పల్లీలను 8 గంటలు నానబెట్టి తర్వాత బాగా ఉడికించాలి. 10 నిమిషాలు ఉడకబెడితే అవి మెత్తగా టేస్టీగా బాగుంటాయి. ఈ ఉడకబెట్టిన పల్లీలు తింటే గర్భిణులకు చాలా మంచిది. బరువు పెరగడం లేదనుకునే వారికి కూడా ఈ వేరుసెనగ పప్పు బాగా పనిచేస్తాయి. ఇవి కడుపులో కూడా చాలా సులభంగా జీర్ణం అవుతాయి. బలం కోసం బాదం, కాజూ మాత్రమే కాకుండా ఈ పల్లీలను కూడా తినవచ్చు.
*అదేవిధంగా వేరుశెనగల్లో అనేక ఔషధ గుణాలున్నాయి. రైబోఫ్లేవిన్, థియామిన్, బి6 విటమిన్, కాపర్, మాంగనీస్, పొటాషియం, జింక్, సెలీనియం, క్యాల్షియం, ఐరన్ లాంటి పోషకాలు ఉన్నాయి.
*వీటిలో మోనో అన్ సాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు వున్నాయ్. ఇవి గుండె కండరాల పనితీరును మెరుగు పరుస్తాయి. రక్తంలో వుండే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. గుండెపోటు రాకుండా నివారిస్తుంది. పక్షవాతం కూడా రాకుండా నివారిస్తుంది.
* పల్లీలు రంగుమారిన.. తినేటప్పుడు చేదుగా అనిపించినా తినవద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే రంగు మారిన పల్లీల్లో విషపదార్థాలు వుండే అవకాశం వుంది.
* వేరుశనగ పప్పు తినడం వల్ల మానసిక సమస్య కూడా తగ్గుతుంది. ఇందులో వుండే ట్రెప్టోఫోన్ శరీరంలోకి వెళ్లిన తరువాత సిరొటోనిన్‌గా మారి మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది.
*అలాగే మూత్రపిండాల్లో రాళ్లు రాకుండా కూడా దోహదం చేస్తాయి. పల్లీల్లో పీచు పదార్థం ఎక్కువగా వుంటుంది. పల్లీలపై పొట్టు తీయకుండా అలాగే తినాలి. వీటిని వేయించినా ఉడకబెట్టిన పొట్టుతోనే తినాలి.
*ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల పెద్దపేగు క్యాన్సర్ రాకుండా నివారిస్తుంది. బరువు ఎక్కువగా ఉన్నవారు పల్లీలు తింటే బరువు తగ్గుతారు. ఇందులో వుండే యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. వేరుశెనగపప్పులు ఇమ్యునిటీ బూస్టర్‌గా పనిచేస్తాయ్. కోవిడ్ లాంటి వైరస్‌లను కూడా అడ్డుకుంటుంది.
*వీటిని తినడం వల్ల కండ పట్టడంతో పాటు నరాల బలహీనత కూడా తగ్గుతుంది. పల్లీల ద్వారా బెల్లంతో చేసిన చిక్కీలు తింటే మేధో సంపత్తి పెరుగుతుంది. ఐరన్ కూడా పుష్కలంగా అందుతుంది. పల్లీలతో చేసిన చిక్కి రోజుకు ఒకటి తింటే శరీరానికి మంచి పోషకాలు, ఖనిజాలు అందుతాయి. పిల్లల్లో ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
నోట్: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహన కోసం మాత్రమే దీనిని అందిస్తున్నాం. నిర్ధారణలు, పర్యవసనాలకు సంబంధించి ‘దిశ’ ఎటువంటి బాధ్యత వహించదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించడం ఉత్తమం.