మతిమరుపు సమస్యతో బాధపడుతున్నారా.. దీంతో ఇట్టే చెక్ పెట్టండి

by Anjali |   ( Updated:17 Sept 2024 4:27 PM  )
మతిమరుపు సమస్యతో బాధపడుతున్నారా.. దీంతో ఇట్టే చెక్ పెట్టండి
X

దిశ, వెబ్‌డెస్క్: శరీరంలో అత్యంత ముఖ్యమైన పార్ట్స్‌లో మెదడు ఒకటి. మెదడు ఆరోగ్యంగా ఉంటేనే అన్ని అవయవాలు సక్రమంగా పని చేస్తాయి. బాడీ యాక్టివ్‌గా ఉంటుంది. కానీ ప్రస్తుత రోజుల్లో పెరుగుతోన్న ఒత్తిడి కారణంగా జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది. బ్రెయిన్‌లో పలు రకాల హానికర ప్రోటీన్లు విడుదలై మెదడు కణాలను నశింపజేస్తున్నాయి. కాగా నిపుణులు మతిమరుపు సమస్యను దూరం చేయడానికి పలు పరిష్కారాలు తరచూ చెబుతూనే ఉంటారు. మతిమరుపుకు చక్కటి మెడిసిన్ యోగా అని నిపుణులు ఇప్పటికే సూచించిన విషయం తెలిసిందే. తాజాగా మిరియాలతో మతిమరుపును దూరం చేసుకోవచ్చంటున్నారు నిపుణులు. అదేలాగో ఇప్పుడు చూద్దాం..

‘మతిమరపు వ్యాధి (అల్జీమర్స్) ఒక దీర్ఘకాలిక న్యూరోడీజెనరేటివ్ వ్యాధి. ఇది నెమ్మదిగా ప్రారంభమై కాలం గడిచేకొద్దీ తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది’. కాగా ఈ సమస్య నుంచి బయటపడాలంటే మిరియాలు మనకు బెస్ట్ ఆప్షన్. వీటలో పెప్పరిన్ ఉంటుంది. పెప్పరిన్ మెదడులోని కణాలను నాశనం చేస్తుంది. అలాగే పెప్పరిన్మ డిమెన్షియా రాకుండా చూస్తుంది. మిరియాలను సూప్స్, స్నాక్స్, సలాడ్స్‌లో కలిపి తీసుకుంటే మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. వంటకాల్లో కారానికి బదులుగా మిరియాలు వాడితే ఆరోగ్యానికి మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. కానీ మితంగా తీసుకోవడం మేలని సూచిస్తున్నారు.

గమనిక: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.


Read More...

Mental happiness: రాత్రి పడుకునే ముందు ఇలా చేశారంటే మానసిక ఆనందం మీ సొంతం!

Advertisement

Next Story

Most Viewed