కంటి సమస్యతో బాధపడుతున్నారా.. అయితే కన్నీళ్లు చాలా అవసరం..

by Anjali |   ( Updated:2023-04-03 11:52:38.0  )
కంటి సమస్యతో బాధపడుతున్నారా.. అయితే  కన్నీళ్లు చాలా అవసరం..
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత రోజుల్లో స్మార్ట్ ఫోన్ల వాడకం చాలా పెరిగిపోతోంది. మోబైల్ వల్ల ఎన్నో లాభాలు ఉన్నప్పటికి.. స్క్రీన్‌ను ఎక్కువ సేపు చూడటం వల్ల మరెన్నో సమస్యలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా కంటి సమస్యలు ప్రధాన కారణంగా చెప్పవచ్చు. అలాగే జీవన విధానంలో మార్పు రావడం ఇంకా కళ్లకు ఒత్తిడిని కలిగిస్తుంది. దీంతో కంటిచూపు పూర్తిగా దెబ్బతింటుందని, అందుకని కన్నీళ్లు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని, ఇవి కళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే కళ్లను ప్రభావితం చేసే సమస్యలేంటో తెలుసుకుందామా..

మాక్యులర్ డీజెనరేషన్ అనేది ఎక్కువగా యాభై ఏళ్లు నిండిన వారికే వస్తుంది. ఈ వ్యాధి వల్ల దగ్గరగా ఉన్న వస్తువులను చూడటం చాలా కష్టం. ఈ వ్యాధి క్షీణత ఒక మచ్చగా అభివృద్ధి చెందుతుంది. ఇది క్రమంగా దృష్టి మధ్యలో కనిపిస్తుంది. కాలం గడుస్తున్న కొద్ది.. కన్ను మొత్తం వ్యాపిస్తుంది. కొందరికి రెండు కళ్లను కూడా ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయి. ధూమపానం చేసేవారికే ఈ వ్యాధి తొందరగా దరిచేరుతుంది. అలాగే దగ్గరలో, దూరంలో ఉన్న వస్తువులను చూడడంలో ఇబ్బంది పడుతున్నారంటే.. దానికి కారణం మీరు ‘‘మయోపియా’’ వ్యాధితో బాధపడుతున్నారని అర్థం. ఈ వ్యాధి వంశపారంపర్యంగా వస్తుంది.


‘కళ్లు డ్రై’గా ఉండే సమస్య చాలా మందిలో తలెత్తుతుంది. ఇది రెండు కళ్ల ఆరోగ్యాన్ని దెబ్బతీయడమే గాక కంటిచూపును కూడా మందగిస్తుంది. ఈ సమస్య ఎక్కువగా కళ్లు పొడిబారడం వారిలో వస్తుంది. అయితే కళ్లను తేమగా ఉంచడానికి, కళ్లను శుభ్రంగా ఉంచడానికి, అంటువ్యాధుల నుంచి రక్షించడానికి కన్నీళ్లు ఎంతో అవసరం. కళ్లలో తేమ అస్సలు లేకపోతే ‘కళ్లు డ్రై’ గా మారే అవకాశాలు ఉన్నాయి. కొంతమందిలో వయస్సు వల్ల, ఆరోగ్య సమస్యలు, మందుల వాడకం వల్ల కూడా ఈ సమస్య వస్తుంది. అలాగే ‘గ్లాకోమా’ వ్యాధి కూడా కంటి సమస్యల్లో ఒకటి. ఆప్టిక్ నరాలపై ప్రభావం చూపడంతో పాటు దృష్టిపై కూడా ఎఫెక్ట్ చూపుతుంది. గ్లాకోమా వంశపారంపర్యం, డయాబెటిస్, ఏదైనా కంటి గాయం వల్ల ప్రభావితమవుతుంది. ఈ వ్యాధి చివరికి కంటిచూపు కోల్పోయేలా చేస్తుంది. ఈ సమస్యతో బాధపడుతున్నట్లయితే మీరు తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకోకుంటే ఈ వ్యాధిని ముందుగానే గుర్తించొచ్చు. కన్నీళ్లు కూడా ఈ సమస్యను కొంతవరకు తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి: అక్కడ పశువులకూ ఆదివారం సెలవు.. ఆ కారణం వెనక దాగిన కఠిన నిర్ణయం!

Advertisement

Next Story

Most Viewed