- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డబ్బుల కోసం ఇబ్బందులు పడుతున్నారా.. అయితే, ఈ చిట్కాలను పాటించండి!
దిశ, ఫీచర్స్: డబ్బు కోసం మనం చాలా కష్ట పడి పని చేస్తుంటాము. కొంత మంది ఎంత సంపాదించినా ఇంట్లో డబ్బు నిలవదు. మరి కొంత మంది డబ్బు కోసం పడని పాట్లు ఉండవు. వాస్తు మన జీవితాలపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. వాస్తు ప్రకారం, మీ ఇంట్లో కొన్ని వస్తువులను ఉంచినట్లయితే, అప్పుడు నెగటివ్ ఎనర్జీ పోయి.. పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అంతే కాకుండా, ఇంటికి శ్రేయస్సు, అదృష్టం తెస్తుంది. కానీ ప్రతి ఒక్కరూ వారికి నచ్చినట్టు తమ ఇంటిని అలంకరించుకుంటారు. కానీ వాస్తు శాస్త్రం ప్రకారం, ఈ వస్తువులను ఇంట్లో పెట్టడం వలన ఇంటి వాతావరణాన్ని పూర్తిగా మార్చవచ్చు. ఆ వస్తువులు ఏంటో ఇక్కడ చూద్దాం..
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ముఖద్వారం, పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి. చెత్తను తలుపు వద్ద ఉంచవద్దు. అలాగే, ఇంట్లోని మెట్ల కింద లేదా పడకగదిలో పూజ కోసం స్థలాన్ని ఉంచకూడదు. ఆర్థిక అభివృద్ధి కోసం, ఇంటి ప్రధాన ద్వారం ఆగ్నేయంలో వినాయకుడి విగ్రహం ఉంచండి.
మీ ఇంటి వాతావరణాన్ని శుద్ధి చేయడానికి మీరు ఇంట్లో దాల్చిన చెక్కలను లేదా బే ఆకులను కాల్చవచ్చు. ఇది నెగటివ్ ఎనర్జీని పోయేలా చేస్తుంది. ప్రతిరోజూ ఇంట్లో శ్లోకం, భజన, మంత్రం పఠించండి . దీని వల్ల ప్రశాంతత దొరుకుతుంది. మీ వంట సామాగ్రిలో విరిగిన వస్తువులను వాడకండి. వీటిని దూరంగా పెట్టడం మంచిది.
మన ఇంట్లో చాలా కాలంగా వాడని వస్తువులు ఎన్నో ఉన్నాయి. ఇవి మీ ఇంటి వాతావరణాన్ని చెడ్డగా మారుస్తాయి. అందువల్ల, మీరు ఎక్కువ కాలం ఉపయోగించని ఏదైనా మీ ఇంటి నుండి తీసివేయండి. ఇంటి ప్రవేశ ద్వారం దక్షిణం వైపు మాత్రమే ఉండాలి. కాబట్టి, దానిని దక్షిణం వైపు మాత్రమే తెరుచుకునేలా ఉంచండి.