చల్ల చెమటలు పడుతున్నయా.. అయితే వెంటనే మీరు వైద్యులను సంప్రదించాల్సిందే..!

by Anjali |   ( Updated:2023-03-23 13:23:11.0  )
చల్ల చెమటలు పడుతున్నయా.. అయితే వెంటనే మీరు వైద్యులను సంప్రదించాల్సిందే..!
X

దిశ, వెబ్‌డెస్క్: శరీరంపై చల్ల చెమటలు పట్టడానికి కొన్ని రకాల క్యాన్సర్లు, అధిక ఒత్తిడి, డయాబెటీస్, తక్కువ రక్తపోటు వంటి అనేక రకాల కారణాల వల్ల అలా జరుగుతోందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. వేసవి కాలంలో ఎండల వల్ల, శరీరానికి గాలి తగలనప్పుడు చెమటలు పట్టడం చాలా కామన్. కానీ ఏ కారణం లేకుండా చెమటలు పడితే మాత్రం ప్రమాదకరమని, కొన్ని రోగాల వల్లే ఇలా అవుతుందనీ అంటున్నారు నిపుణులు. ఇంతకీ ఈ చల్లని చెమటలు ఎందుకు పడతాయో వాటికి కారణాలు తెలుసుకుందాం..

భయాందోళన..

ఎక్కువ భయాందోళనకు గురి కావడం వల్ల చెమటలు పడుతాయి. ఆ సమయంలో ఆందోళన వల్ల శరీరంలో స్ట్రెస్‌ను పెంచుతుంది. ఇది హృదయ స్పందన రేటును, రక్తపోటును పెంచే ఆడ్రినలిన్ వంటి హార్మోన్లను విడుదల చేస్తుంది. అలాగే చెమట పట్టడానికి కారణమవుతుందని నిపుణులు చెపుతున్నారు. ఈ కారణం వల్ల చల్లని చెమటలు పడితే తరచుగా వణుకు, మైకం, శ్వాస ఆడకపోవడం వంటి ఇతర సమస్యలు వస్తాయి.


నిర్జలీకరణం లేదా గుండె సమస్యలు..

శరీరంలో రక్తపోటు అకస్మాత్తుగా పడిపోవడం వల్ల మెదడుకు రక్త ప్రవాహం తగ్గుతుంది. అందుచేత కొన్ని సెకన్ల పాటు స్పృహ కోల్పోయే అవకాశం ఉంది. దీనినే సింకోప్ అంటారు. దీనికి ముందు చల్లని చెమటలు పడతాయి. తక్కువ రక్తపోటు వల్ల నిర్జలీకరణం, రక్త నష్టం, గుండె సమస్యలు లేక ఎక్కువగా మందులు వాడడం వల్ల వస్తుంది. సింకోప్, చల్లని చెమటలు పట్టే వ్యక్తులు హెల్త్ చెకప్‌లు చేయించుకోవడం మంచిది.

హైపోగ్లైసీమియా, రక్తంలో అత్యల్ప షుగర్ లెవల్స్..

మందులు, భోజనం, స్నాక్స్ సమయానికి తీసుకోకపోవడం వల్ల డయాబెటిస్ పేషెంట్ల రక్తంలో చక్కెర స్థాయిలు 70 మి.గ్రా / డిఎల్ కంటే తక్కువగా పడిపోతాయి. అందువల్ల వారికి ఎక్కువగా చెమటలు పడుతాయి. అలాగే వారిలో స్పృహ కోల్పోవడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. డయాబెటిస్ ఉన్నవారు హైపోగ్లైసీమియాను ఎలా నివారించాలని డాక్టర్‌ని కలిసి సలహాలను తీసుకోవాలి.

లుకేమియా, ఎముక క్యాన్సర్క్యాన్సర్లు..

హైపోగ్లైసీమియాతో పాటు లింఫోమా, లుకేమియా, ఎముక క్యాన్సర్ వంటి కొన్ని రకాల క్యాన్సర్లు కూడా చల్ల చెమటలకు కారణమే. ఈ క్యాన్సర్ల వల్ల రాత్రిపూట ఎక్కువగా చెమటలు పడతాయి. ఈ రకమైన చెమటల వల్ల ఒంటిమీదున్న దుస్తులు చెమటతో తడిసిపోతాయి. రాత్రి సమయంలోని చల్లని చెమటలు ఇతర పరిస్థితుల లక్షణాలు అయి కూడా ఉండొచ్చు. కాబట్టి కారణం ఏమై ఉంటుందో తెలుసుకోవాలంటే డాక్టర్‌ని సంప్రదించాలి.

ఛాతీ నొప్పి లేక శ్వాస ఆడకపోవడం..

ఛాతీ నొప్పి, విపరీతమైన చెమట, శ్వాస ఆడకపోవడం వంటివి గుండెపోటు లేక ఆంజినా (ఛాతీ నొప్పి)కు కారణం కావొచ్చు. కొన్ని సమయాల్లో గుండెపోటు ఛాతీ నొప్పి లేకుండా వస్తుంది. అప్పుడు గుండెపోటుకు ముందు చల్లని చెమటలు పట్టడం ప్రధాన లక్షణం. వీటిలో ఏ ఒక్క లక్షణం కనిపించినా ఖచ్చితంగా వెంటనే హాస్పటల్‌కు వెళ్లి డాక్టర్‌తో మాట్లాడి సలహాలు తీసుకోవడం మంచిది.

Also Read...

మహిళల్లో ఈ లక్షణాలు ఉంటే బీకేర్‌ఫుల్

Advertisement

Next Story