ఎనర్జీ డ్రింక్స్ తాగుతున్నారా.. ఇక మీ పని అంతే.. ఎందుకంటే?

by Shiva |   ( Updated:2023-03-22 15:59:16.0  )
ఎనర్జీ డ్రింక్స్ తాగుతున్నారా.. ఇక మీ పని అంతే.. ఎందుకంటే?
X

దిశ, వెబ్ డెస్క్: ఓ మనిషి తాను చేసే పని కంటే రెట్టింపు పని చేసినప్పుడు ఎంచుకునేది ఎనర్జీ డ్రింక్స్. వీటిని తాగే వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. కొంతమంది ఇళ్లలో ఫ్రిజ్ తీస్తే ఎనర్జీ డ్రింక్స్, కూల్ డ్రింక్సే కనిపిస్తాయి. కానీ, కెఫీన్ పానీయాలు మంచి కంటే మనిషి ఆరోగ్యానికి ఎక్కువగా హానీ చేస్తాయి. సాధారణ స్వీటెనర్ డ్రింక్స్ శరీరంపై రోగనిరోధక శక్తిని అణచివేసే ప్రభావాన్ని చూపుతున్నాయని కొత్త అధ్యయనం వెల్లడించింది. ముఖ్యంగా క్యాన్సర్ వంటి భయంకరమైన వ్యాధులని తీసుకొస్తుందని హెచ్చరిస్తున్నారు.

ఎలుకల మీద జరిపిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. అధిక మొత్తంలో సుక్రోలోజ్ తీసుకోవడం వల్ల ఎలుకల్లో తెల్ల రక్త కణాలు క్రియాశీలత తగ్గిపోయిందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. అయితే ఇది ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్, టైప్-1 డయాబెటిస్ తో పోరాడుతున్న వ్యక్తులపై సానుకూల ప్రభావాలని చూపిందని తెలిపారు. ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థ కలిగి ఉండాలన్నా, వ్యాధులను ఎదుర్కోవాలన్న వీటిని దూరంగా ఉంచాలని హెచ్చరిస్తున్నారు.

సుక్రోలోజ్ అంటే...

ఇది ఒక కృత్రిమ స్వీటెనర్. చక్కెర కంటే 600 రెట్లు తియ్యగా ఉంటుంది. ఆహారం, పానీయాలలో దీన్ని అధికంగా ఉపయోగిస్తారు. అయితే దీని ప్రభావాలు శరీరం మీద ఎటువంటి ప్రభావాలు చూపిస్తాయనే దాని మీద మరిన్ని పరిశోధనలు చేయాల్సి ఉందని పరిశోధకులు చెబుతున్నారు. ఓ వార్త సంస్థ ప్రచురించిన కథనం ప్రకారం.. ఎలుకలకు 30 కప్పుల తీపి కాఫీకి సమానమైన సుక్రోలోజ్ తినిపించారు. అంటే 10 క్యాన్ల ఫిజీ ఎనర్జీ డ్రింక్స్. ఇవి తీసుకున్న ఎలుకల్లో తక్కువ మొత్తంలో T సెల్స్ విడుదల అయ్యాయి. ఇవి క్యాన్సర్ కి వ్యతిరేకంగా పోరాడే తెల్ల రక్తకణాల్లో ఒక రకం. అయితే ఇవి రోగనిరోధక శక్తి కణాలపై ఎటువంటి ప్రభావం చూపించలేదని పరిశోధకులు తెలిపారు.

సుక్రోలోజ్ అధికంగా తీసుకుంటే ఆరోగ్యానికి హానికరం అని నిపుణులు చెబుతున్నారు. ఎనర్జీ డ్రింక్స్ లోని కెఫీన్ అధిక మొత్తంలో శరీరంలోకి చేరితే అవయవాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దాని ప్రభావం అన్నింటికంటే ముందు గుండె పనితీరుపై కనిపిస్తుంది. గుండె కొట్టుకునే వేగం కూడా ఒక్కసారిగా పెరుగుతుంది. ఒక్కోసారి గుండె పోటు వచ్చే ప్రమాదం అధికంగా ఉంది.

ఇవి కూడా చదవండి : Jonna Rotte: జొన్న రొట్టెలను తింటున్నారా ?అయితే వీటి గురించి తెలుసుకోవాలిసిందే!

Advertisement

Next Story

Most Viewed