- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Alcohol Effect : డయాబెటిస్ ఉందని తెలిసి కూడా మద్యం సేవిస్తున్నారా..? శరీరంలో జరిగే మార్పులివే..
దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం చాలామందికి మద్యం సేవించే అలవాటు ఉంటోంది. పండుగలు, పంక్షన్ల వేళల్లో అయితే కొందరు మరింత ఎక్కువగా ఆల్కహాల్ సేవిస్తుంటారు. పలువురిలో ఇదొక వ్యసనంగానూ మారుతోందని నిపుణులు పేర్కొంటున్నారు. కానీ ఈ అలవాటు క్రమంగా అనారోగ్యానికి కారణం అవుతుంది. ఇక షుగర్ పేషెంట్లకు మద్యం మరింత ప్రమాదకరం. వారు ఆల్కహాల్ అధికంగా సేవిస్తే శరీరంలో వచ్చే మార్పులేవి?, ఆరోగ్యంపై ఎలా ప్రభావితం చూపుతుందో ఇప్పుడు చూద్దాం.
కిడ్నీలు, లివర్‌పై ఎఫెక్ట్
ప్రతిరోజూ ఆల్కహాల్ తాగడం అనేది ఎవరికైనా ప్రమాదమే. అయితే డయాబెటిస్ రోగులకు మరింత రిస్క్. రెగ్యులర్‌గా తాగితే క్రమంగా కిడ్నీలు, లివర్ ఆరోగ్యాలపై ప్రతికూల ప్రభావం పడతాయి. కొంతకాలానికి డ్యామేజ్ అయ్యే అవకాశం ఎక్కువ. అంతేకాకుండా షుగర్ పేషెంట్లలో ఆల్కహాల్ అలవాటు రక్తంలో షుగర్ లెవల్స్ పెరిగేందుకు కారణం అవుతుంది. ఎందుకంటే ఆల్కహాలిక్ డ్రింక్స్‌లో షుగర్ అండ్ కార్బో హైడ్రేట్లు అధికంగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెరస్థాయిలను మరింత పెంచుతాయి.
షుగర్ కంట్రోలింగ్ సామర్థ్యం తగ్గవచ్చు
అలాగే ఆల్కహాల్ అలవాటు అందరిలో ఒకే విధమైన ప్రభావం చూపుతుందని చెప్పలేం.. కాకపోతే అది శరీరంలో వివిధ ప్రతి చర్యలను మాత్రం తప్పక కలిగిస్తుంది. వెంటనే ఎఫెక్ట్ పడకపోయినా కొంత కాలం తర్వాతో, దీర్ఘ కాలం తర్వాతో బాడీలో షుగర్ వెల్స్‌ను నియంత్రించే సామర్థ్యాన్ని మద్యం లేదా ఆల్కహాల్ తాగే అవాటు దెబ్బతీస్తుందని నిపుణులు చెప్తున్నారు. డయాబెక్ పేషెంట్లలో ఈ రిస్క్ మరింత ఎక్కువ.
టైప్ -1 డయాబెటిస్ ఉంటే..
అధికంగా మద్యం తాగే అలవాటు టైప్ -1 డయాబెటిస్ పేషంట్లలో రక్తంలో చక్కెరస్థాయిలు అకస్మాత్తుగా పడిపోవడానికి దారితీస్తుంది. ఇది కూడా ప్రమాదమే. అంతేకాకుండా మద్యంలో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండటం మూలంగా ట్రైగ్లిజర్ల్ స్థాయిలు, అధిక బరువు పెరగడానికి ఆస్కారం ఎక్కువ. అధిక రక్తపోటు సమస్యకు కూడా దారితీస్తుంది.
ఎప్పుడు ప్రమాదం కాదు?..
శరీరంలో షుగర్ లెవల్స్‌ను పెంచనంత వరకే ఆల్కహాల్ ప్రమాదకరం కాదని నిపుణులు అంటున్నారు. అలాగని చక్కెరస్థాయిలు తక్కువగా ఉన్నాయని రోజూ తాగడం, ఎక్కువ తాగడం కూడా సురక్షితం కాదు. ఇక రక్తంలో షుగర్ లెవల్స్ తక్కువగా ఉన్నవారు కూడా ఎటువంటి ఆహారం తీసుకోకుండా ఆల్కహాల్ తాగితే అవి పెరగే అవకాశం ఉంది. దీంతో పైగా ఖాళీ కడుపుతో ఆల్కహాల్ సేవించినప్పుడు లివర్ దానిని జీర్ణం చేయడంలో వైఫల్యం చెందుతుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. కాబట్టి ఆల్కహాల్ అధికంగా సేవించడం మంచిది కాదు. లిమిట్‌గా తీసుకోవాలని భావించినా ముందుగా ఆరోగ్య నిపుణులను సంప్రదించి సలహాలు తీసుకోవడం మంచిది.
*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. నిర్ధారణలు, పర్యవసనాలకు ‘దిశ’ బాధ్యత వహించదు. అనుమానాలు ఉంటే ఆరోగ్య నిపుణులను సంప్రదించగలరు.