- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొబ్బరి నూనెను ముఖానికి రాస్తున్నారా..? అయితే, ఇది తెలుసుకోండి..!
దిశ, ఫీచర్స్: శీతాకాలం మొదలైంది. ఈ సీజన్ ఎన్నో రకాల చర్మ సమస్యలకు కారణం కావచ్చు. చాలా మందికి ఈ కాలంలో స్కిన్ డ్రైగా మారి, తెల్లగా పాలిపోతుంది. పాదాల పగుళ్లు, చర్మంపై ముడతలు, పెదాల పగుళ్ల వంటి సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. అయితే, ఈ సమస్యలను తగ్గించుకోవడం కోసం చాలామంది రకరకాల క్రీములను వాడుతుంటారు. కొంతసేపటి తరువాత మళ్లీ చర్మం మాములుగానే మారిపోతుంది. అయితే, ఈ సీజన్‌లో చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే కొబ్బరి నూనె మేలు చేస్తుంది. ఒకప్పుడు చర్మం పాలిపోయినా, స్కిన్‌పై దద్దురులు వచ్చినా కొబ్బరినూనెను ఎక్కువగా వాడుతుంటారు. ఈ కొబ్బరి నూనె చర్మాన్ని కాపాడుతుందని నిపుణులు చెబుతున్నారు.
శీతాకాలం అయినా వేసవి కాలం అయినా చర్మం పొడిబారుతుంది. ఈ సమస్యలకు కొబ్బరినూనె ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఉండే విటమిన్లు, ఖనిజాలు చర్మానికి మేలు చేస్తాయి. కొబ్బరి నూనెలో కొద్దిగ గ్లిజరిన్ వేసి బాగా మిక్స్ చేసి చర్మానికి రాసుకోవాలి. ఈ గ్లిజరిన్, కొబ్బరి నూనె రెండూ చర్మాన్ని తేమగా ఉంచడంలో సహాయపడుతుంది. అలాగే డీహైడ్రేషన్ సమస్యను తగ్గిస్తుంది. చర్మం కాంతివంతంగా ఉంచడానికి సహాయపడుతుంది.
ఫేస్ మాస్క్: చలికాలంలో ఎలాంటి చర్మ సమస్యలు రాకుండా ఉండాలంటే కొబ్బరి నూనె ఉపయోగపడుతుంది. ముఖం కాంతివంతంగా మెరవాలంటే కొబ్బరినూనెలో కొద్దిగ కాఫీ పౌడర్‌ని కలుపుకోవాలి. దీనిని ముఖానికి మసాజ్ చేస్తున్నట్లు అప్లై చేసి, 15 నిమిషాల తరువాత శభ్రంగా కడిగేయాలి. ఈ మాస్క్ ముఖంపై ఉన్న డెడ్ స్కిన్ సెల్స్‌ను తొలగించడంలో సహాయపడి, చర్మం ఆరోగ్యంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది.
అంతేకాకుండా ఈ సీజన్‌లో చర్మం తేమగా ఉండాలంటే నీళ్లు ఎక్కువగా తాగాలి. చాలామంది చలికాలంలో దాహం లేదని నీరు తాగడం మానేస్తుంటారు. కానీ, ఇలా అస్సలు చేయకూడదు. శరీరానికి సరిపడ నీరు తాగకపోవడం వల్ల చర్మం పొడిబారుతుంది. హెల్తీ చర్మం కోసం విటమిన్-ఎ, విటమిన్-డి, ఐరన్, జింక్, కాల్షియం వంటి పోషకాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం మంచిది. రాత్రిపూట ముఖానికి కొబ్బరినూనెతో మసాజ్ చేస్తే, రాత్రంతా ముఖం తేమగా మారి సాఫ్ట్‌గా ఉంటుంది. అంతేకాకుండా ఇలా మసాజ్ చేయడం వల్ల రక్తప్రసరణ జరిగి చర్మం తాజాగా ఉంటుంది.
పొడి బారిన చర్మం ఉన్న వారికి ఈ కొబ్బరినూనె మాశ్చరైజర్‌గా పనిచేస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఇన్‌ప్లమేటరీ గుణాలు మొటిమల వల్ల వచ్చే వాపులను తగ్గిస్తుంది. వేసవికాలంలో కూడా సూర్యుడి నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాలను చర్మాన్ని ప్రభావితం చేయకుండగా నిరోధిస్తుంది. అంతేకాకుండా ఈ కొబ్బరినూనెని సహజ మేకప్ రిమూవల్‌గా కూడా ఉపయోగించవచ్చు.